Breaking News

లోపాలు సరిచేసుకోకపోతే రూ.కోటి జరిమానా

Published on Sat, 05/17/2025 - 05:13

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అన్ని ప్రభు­త్వ వైద్య కళాశాలల్లో లోపాలపై జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) కన్నెర్రచేసింది. లోపా­లు దిద్దు­కోక­పోతే ఒక్కో మెడికల్‌ కాలేజీ రూ.కోటి జరి­మానా కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. వారం కిందట జాతీయ మెడికల్‌ కమిషన్‌ అధికారి సుఖ్‌లాల్‌ మీనా రాష్ర్టంలోని అన్ని కాలేజీలకు విడివిడిగా నోటీసులు జారీ చేశారు. ఒక్కసారిగా రాష్ర్టంలోని 16 మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ నోటీసులు ఇవ్వడంతో వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఉలిక్కి పడింది. గత ఏడాదిగా ఫ్యాకల్టీ లోపాలపై సర్కారు దృష్టి సారించలేదు. చాలా చోట్ల ప్రొఫె­సర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల కొరత ఉంది. కొన్ని చోట్ల రెసిడెంట్‌లు, ట్యూటర్ల కొరతా వేధిస్తోంది. లోపాలు సరిదిద్దుకోమనడం వేరని, లేదంటే కోటి రూపాయల జరిమానా చెల్లించాలనడం ఏంటని డీఎంఈ కార్యాలయం మధనపడుతోంది. 

మీరే బాధ్యులు.. మీరే చెల్లించాలి 
ఈనెల 6వ తేదీన నోటిసులు వచి్చన అనంతరం డీఎంఈ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ల సమావేశం జరిగింది.  వైద్య కాలేజీల్లో లోపాలకు కళాశాలల ప్రిన్సిపాళ్లే బాధ్యులని, ఒక వేళ ఎన్‌ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తే రూ.కోటి జరిమానా ఆయా మెడికల్‌ కాలేజీలే చెల్లించాలని, ప్రభుత్వం ఈ డబ్బు ఇవ్వదని డీఎంఈ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు వైద్య కాలేజీల ప్రిన్సిపాళ్లు, వైస్‌ ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి తామెందుకు బాధ్యత వహించాలని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏ రాష్ట్రంలో పెరగని విధంగా ఏపీలో యూజీ, పీజీ సీట్లు పెరిగాయి. భారీగా అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్ల నియామకం జరిగింది. మౌలిక వసతుల కల్పన ఊహించని స్థాయిలో జరిగింది. అయినా సరే సీట్లు నిలబడాలంటే ఎప్పటికప్పుడు వనరులు సమకూర్చుకోవాల్సిందే. కానీ కూటమి సర్కారు దీనిపై దృష్టి సారించలేదు.

ఇవీ ప్రధాన సమస్యలు 
⇒ ఏడాదిగా పదోన్నతులు లేవు.. ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల కొరత 
⇒ హిస్టోపెథాలజీ, సైటో పెథాలజీ ఇన్వెస్టిగేషన్స్‌ వివరాలు లేకపోవడం 
⇒ కొన్ని విభాగాల్లో మౌలిక వసతులు సరిగా కల్పించక పోవడం 

⇒ ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వక పోవడం 
⇒ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లకు సరిపడా వసతులు లేవు 
⇒ గైనిక్‌ వార్డుల్లో వేధిస్తోన్న బెడ్‌ల కొరత 
⇒ అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు తదితర చోట్ల పరిస్థితులు దారుణం  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)