Breaking News

ఆయిల్‌ పామ్‌ కింగ్‌ ఏపీ

Published on Sat, 09/14/2024 - 04:45

సాక్షి, అమరావతి: ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. దేశంలో ఆయిల్‌ పామ్‌ సాగు వృద్ధికి ఏపీ దిక్సూచిగా నిలిచిందని నూనె గింజల ఉత్పత్తి రాష్ట్రాలపై నీతి ఆయోగ్‌ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, హరియాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాట­క, తమిళనాడు, మహారాష్ట్ర.. ఈతొ­మ్మిది రాష్ట్రాలే దేశం మొత్తం నూనె గింజల విస్తీర్ణం, ఉత్పత్తిలో 90 శాతం పైగా దోహదం చేస్తున్నాయని నివేదిక తెలిపింది. 

ఈ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు, ఉత్పత్తిపై మరింత దృష్టి సారించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించాల్సిందిగా నీతి ఆయోగ్‌ నివేదిక సూ­చించింది. ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధిపత్యం చెలా­యిస్తున్నా­యని తెలిపింది. దేశంలో మొత్తం ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం 3,70,028 హెక్టార్ల­లో ఉండగా ఇందులో ఏపీలోనే అత్య­ధికంగా 1,84,640 హెక్టా­ర్లలో ఉందని వివరించింది. 

ముడి పామా­యిల్‌ ఉత్పత్తి­లో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థా­నంలో ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ముడి పామాయిల్‌ ఉత్పత్తి 3,60,729 టన్ను­లుండగా అందులో ఏపీలోనే అత్యధికంగా ముడి పామాయిల్‌ ఉత్పత్తి 2,95,075 టన్నులు ఉందని, ఆ తరు­వా­త స్థానాల్లో తెలంగా­ణ, కర్ణాటక, మిజోరంలు ఉన్నాయని చెప్పింది.

ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలి
మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన చర్య­లు తీసుకోవాలని నీతి ఆయోగ్‌ నివేదిక సూచించింది. దేశీ­య ఉత్ప­త్తిని పెంచడం ద్వారా దిగు­మ­తులను తగ్గించేందుకు ఎడిబు­ల్‌ ఆయి­ల్‌ మిషన్‌ను కేంద్రం ఏర్పా­టు చేసిందని తెలిపింది. 

నూనె గింజలు సాగు, ఉత్పత్తి మరింత విస్తరింప చేసేలా వ్యూహాలను, రోడ్‌ మ్యాప్‌లను అమ­లు చేయాలని నివేదిక సూచించింది. ఈ రంగంలో ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యం­గా ముందుకు సాగాలని  పేర్కొంది. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)