Breaking News

హైకోర్టు జడ్జీలుగా ముగ్గురు ప్రమాణం

Published on Tue, 10/29/2024 - 03:41

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయ­మూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూటా చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లు సోమ­వారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురి­తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జన­రల్‌ వై. లక్ష్మణరావు ఈ ముగ్గురు నియా­మ­కానికి సం­బంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ­చేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారితో ప్రమా­ణం చేయించారు. ఆ తర్వాత సీజే ఒక్కొ­క్కరికీ రాష్ట్రపతి జారీ­చేసిన ఉత్తర్వులను అందచే­శారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూ­ర్తులు, అల­హాబాద్‌ హై­కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేష్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ చల్లా కోదండరాం, జస్టిస్‌ మంతోజు గంగారావు, ప్రమా­ణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యు­లు, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాల­పాటి శ్రీని­వాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్‌ జన­రల్‌ (డీఎస్‌జీ) పసల పొన్నారావు, పబ్లిక్‌ ప్రాసి­క్యూటర్‌ మెండ లక్ష్మీ­నారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవా­దులు పాల్గొ­న్నారు.

ప్రమాణం అన­ంతరం జస్టిస్‌ ధనశేఖర్‌ సీనియర్‌ న్యాయ­మూర్తి జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌తో కలిసి కేసులను విచారించారు. జస్టిస్‌ మహే­శ్వర­రావు, జస్టిస్‌ గుణరంజన్‌లు సింగిల్‌ జడ్జీ­లు­గా కేసులను విచారించారు. ప్రమా­ణం సంద­ర్భంగా న్యాయ­వాదులు, శ్రేయోభిలా­షులు వీరికి శుభా­కాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురితో హై­కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను న్యాయాధికారులు, న్యాయవా­దులతో భర్తీచేసేందుకు జనవరిలో చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)