Breaking News

అద్భుతం.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా శిశువులో చలనం

Published on Sun, 11/10/2024 - 13:30

విశాఖ: కేజీహెచ్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు తరలిస్తుండగా ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.

కేజీహెచ్‌లో  శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ  ప్రాణం లేకుండా శిశువు జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువులో ఎలాంటి చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును  తండ్రికి అప్పగించారు.

శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్‌ వైద్యులు నిర్ధారించడంతో అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన హృదయంతో అంబులెన్స్‌లో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌ ఎక్కిన ఆ తండ్రి ఒడిలో ఉన్నశిశువులో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. అప్రమత్తమైన తండ్రి కేజీహెచ్‌ వైద్యులకు సమాచారం అందించారు. చికిత్స చేసిన వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.  అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యులు పసికందును చేతుల్లోకి తీసుకొని ఆనందంలో మునిగిపోయారు. అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)