Breaking News

రాజధాని నిర్మాణానికి కొత్తగా టెండర్లు

Published on Tue, 11/05/2024 - 05:23

సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసి త్వరలో కొత్తగా టెండర్లను పిలుస్తామని పురపాలక పట్టణా­భి­వృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలి­పారు. మూ­డేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చే­స్తా­మ­న్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమ­వారం సీఎం అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వివరించా­రు. 

అమరావతి అభివృద్ధి పనుల కోసం  2014–19 మధ్య రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పి­లిచి, రూ.38 వేల కోట్ల పనులను ప్రారంభించిన­ట్టు తెలిపారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవ­నాలు, రహదా­రులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధి­కారుల వసతి గృహాల నిర్మాణం చేపట్టామ­న్నారు. గత ప్రభుత్వం ఈ పనులను కొనసాగించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు. 

పాత టెండర్ల సమ­స్యలను పరిష్క­రించి నూతన టెండర్లకు విధి విధా­నాల రూపకల్ప­నకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 23 పాయింట్లతో గతనెలలో ని­వే­దిక ఇవ్వగా, ఈ సమా­వేశంలో దానిని ఆమోదించినట్టు చెప్పారు. దాని ప్రకా­రం హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణానికి జనవరిలోగా, మిగతా పనులకు వచ్చేనెల 31 లోపు టెండర్లు పిలుస్తామని, మూ­డేళ్లలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. 

వరద నివారణ పనులు
అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అయితే నిబంధనల మేరకు వరద నివారణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిందని తెలిపారు. అందుకనుగు­ణంగా అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరి­ధిలో వరద నివారణ పనులను ఆమోదించామ­న్నా­రు. కొండవీటివాగు, పాల­వాగు,  గ్రావిటీ కెనా­ల్‌ను విస్తరిస్తామని చెప్పారు. 

నీరు­కొండ వద్ద 0.04 టీ­ఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీలు, శాఖ­మూరు వద్ద 0.01 టీఎంసీల స్టోరేజి సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామ­న్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల పంపింగ్‌ స్టేషన్‌ నిర్మిస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్, ఔ­టర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని చెప్పారు.  

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)