Breaking News

60 కి.మీ నుంచి 900 కి.మీకు..

Published on Tue, 06/24/2025 - 05:45

సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన బదిలీల్లో అనేక తప్పులతో అభాసుపాలైన రాష్ట్ర సాంకేతిక విద్య, ఇప్పుడు కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఏటా జోన్‌ స్థాయిలో జరిగే బదిలీలను ఈసారి సాంకేతిక విద్య డైరెక్టరేట్‌ నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ పద్ధతిలో చేపట్టనున్నారు. మంగళవారం ఈ ప్రక్రియ చేపట్టాలని షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతోపాటు జోన్‌–4లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పనిచేసే 56 మందిని జోన్‌–1లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో జూన్‌ నుంచి ఏప్రిల్‌ వరకు 11 నెలల కాలానికి ఆయా జోన్ల పరిధిలోని కాలేజీల్లో పనిచేసేందుకు విధుల్లోకి తీసుకుంటారు. కానీ ఈసారి కాంట్రాక్టు లెక్చరర్లను జోన్లు, రీజియన్లు దాటించి మరీ నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.  

రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు.. 
గతేడాది 200 మంది అధ్యాపకులను సర్దుబాటు పేరుతో బదిలీలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని రద్దు చేశారు. ఇకపై బదిలీల వ్యవహారం సవ్యంగా సాగుతుందని అందరూ భావించారు. అయితే గతానుభవాలను విస్మరించిన సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్‌ మళ్లీ అదే రీతిలో బదిలీలకు తెరలేపింది. వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి జోన్‌–4లో నియమించాల్సిన కాంట్రాక్టు లెక్చరర్లు 56 మందిని ఆంధ్రా రీజియన్‌ జోన్‌–1లో నియమించేందుకు నిర్ణయించారు. తక్కువ జీతాలకు పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో నియమించడం ఆశ్చర్యకరం.

ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు లెక్చరర్లు 309 మంది ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో పీఆర్సీ అమలు చేయడంతో నెలకు రూ.61,960 వేతనం 10 రోజులు మినహా 12 నెలల కాలానికి పొందేవారు. కానీ కూటమి ప్రభుత్వం వీరి వేతనాన్ని రూ.54,060కు తగ్గించేందుకు నిర్ణయించింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో పాత వేతనమే ఉంచి ఉత్తర్వులిచ్చారు. దీంతోపాటు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నుంచి కూడా వీరిని తొలగించింది. ఇంత తక్కువ వేతనంతో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను జోన్‌ దాటి రీజియన్‌ పరిధిలోకి బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.  

అరకొరవేతనంతో అంతదూరమా?  
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో రెండు నెలల క్రితం సిబ్బంది రేషనలైజేషన్‌ చేపట్టారు. మూడేళ్లుగా విద్యార్థులు లేని కోర్సుల్లో లెక్చరర్‌ పోస్టులు సహా లెక్చరర్లను అవసరమున్న చోటికి తరలించారు. ఇటీవల రెగ్యులర్‌ బదిలీలు పూర్తి చేశారు. జోన్‌–1లో 2009లో ఏర్పాటు చేసిన కాలేజీల్లో మాత్రం లెక్చరర్లను నియమించలేదు. ఈ ప్రాంతానికి పోస్టులు మంజూరు చేయకపోవడంతో జోన్‌ పరిధిలోని కాలేజీల్లోని రెగ్యులర్‌ లెక్చరర్లతో సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. అయితే, గతేడాది కూటమి ప్రభుత్వం వర్క్‌లోడ్‌ పేరుతో దాదాపు 200 మంది రెగ్యులర్‌ లెక్చరర్లకు సర్దుబాటు బదిలీలు చేసినా జోన్‌ స్థాయిలో జరగాల్సినవి రీజియన్లనే మార్చి మరీ చేశారు.

60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరంలో నియమించడంతో బాధితులు పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. మళ్లీ ఈ ఏడాది రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకి బదిలీ చేసి వేధించడం తప్ప దీని ద్వారా ప్రభుత్వానికి, సాంకేతిక విద్యాశాఖకు వచ్చే లాభం ఏంటో తెలియడం లేదని వాపోతున్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)