Breaking News

యుద్ధ నౌకకు ‘పనోరమ’ తోడుగా!

Published on Sat, 10/11/2025 - 05:41

సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో నిత్యం పహారా కాసే యుద్ధ నౌకలు, సాగర గర్భంలో శత్రువుల్ని మట్టుబెట్టాలనే లక్ష్యంతో గస్తీ కాసే సబ్‌మెరైన్‌లకు కొన్ని సందర్భాల్లో సరైన వాతావరణ సమాచారం అందడం లేదు. ఫలితంగా నడిసముద్రంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు అందిస్తూ.. వార్‌షిప్‌లని అప్రమత్తం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సరికొత్త యాప్‌ని అందుబాటులోకి తీసుకొచి్చం­ది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా నేవల్‌ ఓషనాలజీ ఆధ్వర్యంలో పనోరమ వెర్షన్‌ 3.0 అప్లికేషన్‌ రియల్‌టైమ్‌ మల్టీమోడల్‌ వెదర్‌ అప్లికేషన్‌గా వ్యవహరించనుంది. 

వాతావరణ సమాచారం పక్కాగా.. 
పనోరమా వెర్షన్‌ 3.0 ద్వారా సమగ్ర వాతావరణ సమాచారం ముందస్తుగానే అందించేలా డిజైన్‌ చేశారు. దీనిని ఇండియన్‌ నేవీకి చెందిన నేవల్‌ ఓషనాలజీ, భాస్కరాచార్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ అండ్‌ జియో ఇన్ఫర్మేటిక్స్‌(బీఐఎస్‌ఏజీ అండ్‌ ఎన్‌) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీని ద్వారా నేవీ సిబ్బందికి వాతావరణ సమాచారం పక్కాగా అందనుంది. 

విపత్కర సమయంలో సముద్రంలో నేవిగేషన్‌గా కూడా వినియోగించవచ్చు. ఇండియన్‌ నేవీ డిజిటల్‌ విజన్, ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ అప్లికేషన్‌ని రూపొందించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఈ అప్లికేషన్‌ని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)