Breaking News

నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడి

Published on Wed, 01/15/2025 - 13:15

సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో కూటమి పాలనలో కోడి పందెం బెట్టింగ్‌ చర్చనీయాంశంగా మారింది. కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్‌ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు.

తాడేపల్లిగూడెం పట్టణంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది. కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు. 

విజయవాడ.. ఇదిలా ఉండగా.. సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలను కూటమి నేతలు ప్రోత్సహిస్తున్నారు.  కోడి పందెం బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకున్నారు కూటమి నేతలు. కూటమి ఎమ్మెల్యేలకు కోడి పందెం బరుల్లో వాటాలు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే అనుచరులే హవా కొనసాగిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందెం బరుల్లో జూద క్రీడలకు స్పెషల్ ఏర్పాట్లు చేశారు. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు, బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నారు.  

తొలి రెండు రోజుల్లోనే చేతులు మారిన వందల కోట్ల రూపాయలు. జూదం, మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు. అందుకు తగినట్టుగానే భారీగా డబ్బులు వసూలు. అయితే, పండుగ ముందు పోలీసులు.. కోడి పందేలు, పేకాట, గుండాటలు ఆడితే తాటతీస్తామని హెచ్చరించారు. తీరా పండుగ వచ్చాక మాత్రం.. పోలీసులు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కూటమి నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శలు వస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)