Breaking News

నెల్లిమర్ల జూట్‌మిల్‌ మళ్లీ మూత

Published on Tue, 07/02/2024 - 06:05

నెల్లిమర్ల: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్‌­మిల్‌ మరోసారి మూతపడింది. జూట్‌ కొరతను కారణంగా చూపి సోమవారం కర్మా­గారాన్ని లాకౌట్‌ చేశారు. ఇటీవల కాలంలో తరచూ మిల్లును లాకౌట్‌ చేస్తుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మిల్లులో పనిలేక, వేరేపనికి వెళ్లలేక కార్మిక కుటుంబాలు యాతన పడు­తు­న్నారు. జూట్‌మిల్‌లో సుమారు 200 మంది రెగ్యు­లర్, మరో 1,800 మంది కాంట్రాక్టు కార్మి­కులు పని­చేస్తున్నారు. ముడి­సరుకు కొరత పేరిట యాజ­మాన్యం మిల్‌ను అక్రమంగా మూసి­వేయడంపై కార్మిక కుటుంబాల ఆవేదన చెందుతు­న్నాయి. 

కొన్నే­ళ్లుగా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందటం లేదు. 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్‌ యాజమాన్యం చెల్లించలేదని కార్మికులు చెబుతున్నారు. చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లకుండాపోతున్నాయని రిటైర్డ్‌ కార్మికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మిల్‌ను తెరిపించే ఏర్పాట్లు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.

కార్మికులకు న్యాయం చేయాలి
రిటైర్డ్‌ కార్మికులకు 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా జూట్‌ యాజమాన్యం చెల్లించలేదు. వారికి చెక్కులు ఇచ్చినప్పటికీ ఖాతాలో నగదు లేకపోవడంతో చెక్కులు చెల్లకుండా పోతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కర్మాగారం తెరిపించే ఏర్పాట్లు చేయాలి. 
– కిల్లంపల్లి రామారావు, సీపీఎం నాయకుడు, నెల్లిమర్ల 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)