Breaking News

నీట్‌ యూజీ రాష్ట్ర అర్హుల జాబితా విడుదల 

Published on Sat, 07/01/2023 - 03:43

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ–2023లో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. నీట్‌లో మొత్తం 720 మార్కులకు 720 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌ పొందిన బోరా వరుణ్‌ చక్రవర్తి స్టేట్‌ టాపర్‌గా నిలిచాడు. 711 మార్కులతో ఆల్‌ ఇండియా 25వ ర్యాంకర్‌ వైఎల్‌ ప్రవర్ధన్‌ రెడ్డి రెండో స్థానంలో, 38 ర్యాంకర్‌ వి.హర్షిల్‌ సాయి మూడో స్థానంలో నిలిచారు.

రాష్ట్రంలో మొదటి పది ర్యాంకులు పొందినవారిలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రం నుంచి నీట్‌ యూజీకి 69,690 మంది దరఖాస్తు చేసుకోగా, 68,578 మంది పరీక్ష రాశారు. వీరిలో 42,836 మంది అర్హత సాధించారు. వారిలో అత్యధికంగా 28,471 మంది అమ్మాయిలు, 14,364 మంది అబ్బాయిలు, ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. 

https:// drysr.uhsap.in  వెబ్‌సైట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఉంచారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్విసెస్‌(డీజీహెచ్‌ఎస్‌) అందించిన నీట్‌ అర్హుల వివరాల ఆధారంగా రాష్ట్ర జాబితాను ప్రదర్శించినట్లు డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్‌ వేమిరెడ్డి రాధికరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల కాగానే నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.  

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)