Breaking News

నాలుగు రోజుల్లో నిశ్చితార్థం.. కార్యదర్శి అనుమానాస్పద మృతి

Published on Wed, 04/09/2025 - 13:01

సాక్షి, నిడదవోలు: నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లి కరుణ (25) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో నాలుగైదు రోజుల్లో నిశ్చితార్థం.. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనపై నిడదవోలు రూరల్‌ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకైక కుమార్తె కరుణ. ఆమె వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో వెంటనే కారులో నిడదవోలులో ఒక ప్రైవేటు  ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి సూర్యకుమారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అప్పటి వరకు సరదాగా ఉండి.. కరుణ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందారన్న నిజాన్ని తోటి ఉద్యోగులు నమ్మలేక సామాజిక ఆసుపత్రి వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ఆమె స్వగ్రామం కోరుమామిడిలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండేదని అధికారులు అంటున్నారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు సమీప బంధువుతో వివాహం నిశ్చయమైంది. మరో నలుగైదు రోజుల్లో నిశ్చితార్థం, మే నెలలో వివాహం జరగాల్సి ఉంది. అటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)