Breaking News

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నేడు కీలక సమీక్ష

Published on Mon, 04/28/2025 - 04:53

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నేడు (సోమవారం) కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన మరమ్మతు పనులను నిర్దేశిత కాలపరిమితిలోపు చేపట్టకపోవడంపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆప్రాన్‌ దిగువన 50 మీటర్ల దూరంలో 120 మీటర్ల లోతుతో భారీ గుంత పడింది. ఈ గుంత పునాది కింద వరకు విస్తరించిందన్నది నిపుణుల కమిటీ అనుమానం.  కృష్ణా వరదల ఉద్ధృతికి స్పిల్‌ వే ఎగువన కటాఫ్‌ దెబ్బతినడం వల్ల  స్పిల్‌ వేలో 490 అడుగుల వద్ద ఉన్న గ్యాలరీలో  గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు నిమిషానికి 450 గ్యాలన్లు, కనిష్ట నీటిమట్టం ఉన్నప్పుడు  220 గ్యాలన్ల మేర లీకేజీ (సీపేజీ) చోటుచేసుకుంటోంది.

ప్రాజెక్టు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌.. తక్షణమే మరమ్మతులు చేపట్టి మే 31లోగా పూర్తి చేయాలని మార్చి 6న ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఈ పనులు  చేపట్టకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే సమీక్షా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు భద్రతను సమీక్షించేందుకు అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఎన్‌డీఎస్‌ఏ,  కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణుల బృందం విజయవాడ వస్తోంది.

ఈ బృందం ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనుంది. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టు భద్రతపై సమీక్షించనున్న ఈ బృందం గురువారం నాగార్జునసాగర్‌ను పరిశీలించి.. భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ అధికారులకు మార్గనిర్దేశం చేయనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)