Breaking News

ప్రతి 18మందిలో ఒకరికి షుగర్‌

Published on Tue, 12/24/2024 - 05:02

రాష్ట్రంలో జీవనశైలి జబ్బులు ప్రమాద ఘంటిక మోగిస్తున్నాయి. ప్రతి 18 మందిలో ఒకరు షుగర్‌తో బాధపడుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించే నాన్‌–కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) పోర్టల్‌లోని నవంబరు నెలాఖరు నాటి సమాచారం ఆధారంగా.. రాష్ట్రంలో 3.85 కోట్ల మందికి వైద్యశాఖ స్క్రీనింగ్‌ చేయగా.. 20.92 లక్షల మందిలో షుగర్‌ నిర్ధారణ అయినట్లు తేలింది. దేశవ్యాప్తంగా 32.33 కోట్ల మందికి గాను 2.96 కోట్ల మందిలో ఈ సమస్య ఉంది.

 ఇందులో అత్యధికంగా 47.92 లక్షల మంది కేరళలో ఉన్నారు. అనంతరం.. మహారాష్ట్రలో 40.03 లక్షలు, కర్ణాటక 28.83 లక్షలు, తెలంగాణలో 24.52 లక్షల మంది బాధితులున్నారు. ఈ లెక్కన గమనిస్తే దేశంలో సగటున 11 మందిలో ఒకరు షుగర్‌ సమస్యతో బాధపడుతున్నారు. – సాక్షి, అమరావతి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
⇒ ధూమపానం, మద్యపానం వంటి వాటిని విడనాడాలి.   
⇒ తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి.  
⇒  శరీరంలో కొవ్వు నియంత్రణకు తోడ్పడే జాగ్రత్తలు తీసుకోవాలి.  
⇒ ఆహారంలో జంక్‌ ఫుడ్స్‌ తీసుకోకూడదు. పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.  

⇒  రోజూ కనీసం 30 నిమిషాల నడక, స్విమ్మింగ్, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు విధిగా చేయాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల శరీర కణజాలంలోని ఇన్సులిన్‌ గ్రాహకాల సెన్సిటివిటీ పెరుగుతుంది. 
⇒  తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం మంచిది.

 నియంత్రణ మన చేతుల్లోనే.. 
మధుమేహం రెండు రకాలు. టైప్‌–1.. ఇది వంశపారంపర్యంగా వస్తుంది. టైప్‌–2 ఇది అనారోగ్యకర జీవనశైలితో వస్తుంది. టైప్‌–1ను ఎవరూ ఆపలేరు. కానీ, టైప్‌–2 రాకుండా నియంత్రించడం మన చేతుల్లోనే ఉంది. చిప్స్, నూడిల్స్‌ వంటి అల్ట్రాప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ అధికంగా తీసుకోవడం.. కదలికల్లేని యాంత్రిక జీవనంతో పాఠశాల విద్యార్థుల్లోనూ టైప్‌–2 మధుమేహం వస్తోంది. ఈ అలవాట్లను పూర్తిగా నియంత్రించాలి.  వ్యాయామాలు చేయాలి.

మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యంచేస్తే రెటినోపతి, కిడ్నీల వైఫల్యానికి కారణమయ్యే నెఫ్రోపతి, న్యూరోపతి, రక్తనాళాలకు సంబంధించిన పెరిఫెరల్‌ వాస్క్యులర్‌ వ్యాధుల వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.  – డాక్టర్‌ ఎం. నాగచక్రవర్తి, జనరల్‌ మెడిసిన్‌ మాజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మంగళగిరి ఎయిమ్స్‌ 

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్