Breaking News

సీఎం జగన్‌ను కలిసిన NCC డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌

Published on Wed, 08/02/2023 - 21:16

సాక్షి, గుంటూరు: ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ వీఎం రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. విపత్తు నిర్వహణలో ఎన్‌సీసీ క్యాడెట్‌ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై  చర్చించారు. 

ఏపీలో ఎన్‌సీసీ విస్తరణ ప్రణాళికపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అదనంగా 60 వేల మంది ఎన్‌సీసీ క్యాడెట్‌లను రిక్రూట్‌ చేయడం ద్వారా ప్రతి జిల్లాలో ఎన్‌సీసీ క్యాడెట్‌లు అందుబాటులో ఉంటారని సీఎం జగన్‌కు డీడీజీ వీఎంరెడ్డి వివరించారు. ఏపీ విద్యార్ధులకు సమర్ధవంతమైన శిక్షణను అందించేందుకు వీలుగా ఏపీలో సెంట్రల్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. 

ఎన్‌సీసీకి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ వింగ్‌ క్యాడెట్‌ల శిక్షణ కోసం అవసరమైన సహాయం చేసేందుకు సిద్దమని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎన్‌సీసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సంజయ్‌ గుప్తా, గ్రూప్‌ కమాండర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)