Breaking News

నావిక్‌–03 ఉపగ్రహం కక్ష్య దూరం పెంపు విజయవంతం

Published on Sun, 11/01/2026 - 05:33

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం రాత్రి 11.51 గంటలకు ప్రయోగించిన ఎన్‌వీఎస్‌–03 నావిగేషన్‌ ఉపగ్రహం, తన మొదటి విడత కక్ష్య దూరం పెంపు ప్రక్రియను శనివారం సాయంత్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి విడత ఆపరేషన్‌ తరువాత ఉపగ్రహం కక్ష్య (భూమికి దగ్గరి, దూరపు స్థానాలు)లో మార్పులు చేశారు. భూమికి అత్యంత దగ్గరగా ఉండే దూరం (పెరిజీ)మొదట 170.3 కిలోమీటర్లు ఉండగా, దానిని 5,477.6 కిలోమీటర్లకు పెంచారు. 

భూమికి అత్యంత దూరంగా ఉండే దూరం (అపోజీ) మొదట 38,080 కిలోమీటర్లు ఉండగా, అది ప్రస్తుతం 37,833.4 కిలోమీటర్ల వద్ద స్థిరపడింది. కక్ష్య దూరాన్ని పెంచే అపరేషన్‌ను బెంగళూరులోని ఇస్ట్రాక్‌ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో లామ్‌ ఇంజిన్‌ను 2,174.8 సెకండ్లు మండించి  విజయవంతం చేశారు. మరో మూడు విడతల్లో ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ నుంచి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోఆర్బిట్‌లోకి ప్రవేశపెడతామని కూడా శాస్త్రవేత్తలు తెలియజేశారు.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)