Breaking News

జాతీయస్థాయిలో సత్తాచాటిన సాక్షి ఫొటోగ్రాఫర్లు

Published on Fri, 08/18/2023 - 02:11

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌)/ నాగాయలంక/తిరుపతి కల్చరల్‌: అంత ర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ఫొటో జర్నలిస్ట్‌ అసోసి యేషన్‌ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటో కాంపిటీషన్‌ ఫలితాలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు విడుదల చేశారు. గురువారం విజయవాడలోని జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏపీపీజేఏ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్‌ విజయ భాస్కర రావు, ప్రధాన కార్యదర్శి వి.రూబెన్‌ బెసాలి యల్‌తో కలిసి కలెక్టర్‌ ఫలితాలను విడుదల చేశారు.

పోటీల్లో జనరల్‌ కేటగిరీలో ఎండీ నవాజ్‌ (సాక్షి, వైజాగ్‌) ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఫొటో జర్నలిజం కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.లీలా మోహన్‌రావు (వైజాగ్‌), వి. శ్రీనివాసులు (కర్నూలు), కందుల చక్రపాణి (విజయవాడ), పి.మను విశాల్‌ (విజయవాడ), కె.శివకుమార్‌ (యాదాద్రి),  కె.జయ శంకర్‌ (శ్రీకాకుళం), కేతారి మోహన్‌కృష్ణ (తిరుపతి), ఎస్‌.లక్ష్మీ పవన్‌ (విజయవాడ) కన్సొలేషన్‌ బహుమ తులు గెలుచుకున్నారు.

జనరల్‌ కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్‌ ఎస్‌ లక్ష్మీపవన్‌ (విజయ వాడ) కన్సొలేషన్‌ బహుమతి గెలుచుకు న్నాడు. ఈ సందర్భంగా ఏపీపీజేఏ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికా ఫొటోగ్రాఫర్ల నుంచి 700 ఎంట్రీలు వచ్చాయన్నారు. విజేతలకు ఈనెల 19న విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వ హించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. 

జాతీయ ఫొటో పోటీల్లో  కృష్ణప్రసాద్‌కు మెరిట్‌ అవార్డు
వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వ హించిన నేషనల్‌ ఫొటో కాంటె స్ట్‌–2023లో కృష్ణాజిల్లా నాగాయ లంకకు చెందిన ఫొటోగ్రాఫర్‌ సింహాద్రి కృష్ణప్రసాద్‌ పంపిన ఛాయా చిత్రానికి సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు దక్కింది.

ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా (పీఏఐ), ఇండియా ఇంటర్నే షనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్‌ (ఐఐపీసీ) ఆధ్వర్యంలో జాతీయస్థా యిలో నిర్వహించిన ఫొటో పోటీల్లో స్పెషల్‌ థీమ్‌ మ్యాని ఫెస్టేషన్స్‌ ఆఫ్‌ నేచర్‌లో అండర్‌ స్టాండింగ్‌ ది క్లౌడ్స్‌ విభాగంలో ఆయన పంపిన ‘క్లౌడ్స్‌ అంబరిల్లా టూ గాడ్‌’ ఛాయచిత్రం ప్రథమ సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు దక్కించుకుంది.

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)