Breaking News

జాతీయ స్థాయిలో ఏపీ పరువు గోవింద!

Published on Fri, 01/31/2025 - 05:12

విజయవాడ స్పోర్ట్స్‌: ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఏపీవోఏ), ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఏపీ–శాప్‌) మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. వెరసి రాష్ట్ర క్రీడాకారులకు 38వ జాతీయ క్రీడలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రడూన్‌లో ప్రారంభమైన ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లిన క్రీడాకారులు, కోచ్, మేనేజర్‌లు పడరాని పాట్లు పడుతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 21 క్రీడాంశాలు అర్హత సాధించాయి.

వీటిల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, జూడో, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, మోడ్రన్‌ పెంటాథ్లాన్, షూటింగ్, కానోయింగ్‌ కాయాకింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు, మాల్కాంబ్‌ జట్లు శాప్‌ ద్వారా వెళ్లాయి. ఈ జట్లకు ట్రాక్‌షూట్‌లు, షూ, టీఏ, డీఏ, కిట్, కోచింగ్‌ క్యాంపులకు నగదును శాప్‌ సమకూర్చింది. మిగిలిన ట్రైథ్లాన్, యోగాసన, సైక్లింగ్, బీచ్‌ హ్యాండ్‌బాల్‌ జట్లు ఏపీవోఏ ద్వారా వెళ్లాయి. ఈ జట్లకు ఏపీవోఏ అధ్యక్షుడు ఆర్‌.కె.పురుషోత్తం ట్రాక్‌షూట్, షూ సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జరిగిన మార్చ్‌ఫాస్ట్‌లో రాష్ట్రం నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

వీరిలో కొందరు ధరించిన ట్రాక్‌ షూట్‌లలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, శాప్‌ లోగో లేకపోవడం నిర్వాహకులు, జాతీయ మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.  ర్యాలీలోనూ ఏపీవోఏ ప్రతినిధులు కేవలం ఏపీవోఏ పేరుతో ఉన్న ఫ్లకార్డులు, బ్యానర్‌లనే మైదానంలో ప్రదర్శించారు. ఇదిలా ఉండగా ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ) నిర్వహించే ఈ క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారుల వసతి సౌకర్యాలు ఏపీవోఏ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర క్రీడాకారులకు ఐవోఏ కేటాయించిన గదుల్లోకి శాప్‌ ఆధ్వర్యంలో వెళ్లిన క్రీడాకారులు, మేనేజర్, కోచ్‌లను ఏపీవోఏ కొన్ని గంటల పాటు అనుమతించక పోవడం కలకలం రేపింది. 

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా?
హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్ర క్రీడాకారులను ఆర్‌.కె.పురుషోత్తం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. 21 క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు ట్రాక్‌షూట్, షూ, టీఏ, డీఏ, కిట్‌ సమకూర్చేందుకు శాప్‌ రూ.75 లక్షలను సిద్ధంగా ఉంచినా, రాష్ట్ర పరువు గంగలో కలవడం బాధాకరం. – యలమంచిలి శ్రీకాంత్, ఏపీ కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)