Breaking News

ఏపీ రైతుకు జాతీయ అవార్డు

Published on Sun, 08/13/2023 - 04:36

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువ అభ్యుదయ రైతు నందం రఘువీర్‌ను జాతీయ స్థాయి అవార్డు వరించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆదీనంలోని ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ప్లాంట్‌ వెరైటీస్‌ అండ్‌ ఫార్మర్స్‌ రైట్స్‌ అథారిటీ సంస్థ రెండేళ్లకు ఒకసారి ఈ రంగంలో విశేష సేవలందిస్తున్న రైతులు, సంస్థలకు వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేస్తుంది.

ఇందులో భాగంగా 2023–25 సంవత్సరానికి గాను అత్యంత అరుదైన విత్తనాలను సంరక్షిస్తున్న కేటగిరీలో రఘువీర్‌ను జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డుకు ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రఘువీర్‌ అవార్డు, ప్రశంసాపత్రంతోపాటు రూ.1.50లక్షల నగ­దు బహుమతిని అందుకున్నారు. 

257 రకాలు సేకరించిన రఘువీర్‌ 
అత్యంత పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాలనే సంకల్పంతో రఘువీర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి వ్యవసాయం వైపు వచ్చారు. దేశవ్యాప్తంగా తిరిగి ఇప్పటి వరకు 257 రకాల అత్యంత పురాతన వరి వంగడాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్‌ కలిగిన వంగడాలు ఉన్నాయి. తాను సేకరించిన పురాతన విత్తనాలను పెనమలూరులోని సొంత పొలం 1.3 ఎకరాల్లో సంరక్షిస్తున్నారు.

వీటిని భవిష్యత్‌ తరాల కోసం భద్రపరిచేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీయ విత్తన నిధి(సీడ్‌ బ్యాంక్‌)ను ఏర్పాటు చేశారు. మరో 8 జిల్లాల్లో ‘విత్తన నిధి’ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. పురాతన వరి విత్తనాలను అందించడమే కాదు... వాటి సాగులో మెళకువలపై అవగాహన కలి్పంచి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు నాలుగు రకాల పురాతన వరి వంగడాలను సాగు చేస్తున్నారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు