Breaking News

నారాయణ స్కూల్‌ వాచ్‌మన్‌ పైశాచికం

Published on Tue, 04/04/2023 - 08:52

విశాఖపట్నం: ఓ ప్రైవేట్‌ పాఠశాల వాచ్‌మన్‌ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... కూర్మన్నపాలెం నారాయణ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం తోటి స్నేహితులతో ఆడుకుంటూ వేచి ఉంది. అదే స్కూల్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన అలకోటి పోచన్న (48) బాలికను మాయమాటలతో స్కూల్‌లో ఉన్న బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు.

బాలిక గట్టిగా అరవడంతో వాచ్‌మన్‌  అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించారు. బాలిక శరీరంపై గాయాలు ఉండడంతో కోపోద్రోక్తులైన బాలిక తల్లిదండ్రులు వాచ్‌మన్‌ను పట్టుకునేందుకు ప్రయతి్నంచారు. కానీ అప్పటికే స్కూల్‌ మూసివేయడం, తరువాతి రోజు ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో అతడు దొరకలేదు. సోమవారం స్కూల్‌ తెరిచిన వెంటనే వాచ్‌మన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు స్కూల్‌ వెనుక ప్రాంతంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)