Breaking News

నంద్యాల టూటౌన్‌ సీఐ ఓవరాక్షన్‌

Published on Tue, 02/03/2026 - 07:59

నంద్యాల: చికెన్‌ సెంటర్ల దుకాణ యజమానుల వివాదంలో నంద్యాల టూటౌన్‌ సీఐ అస్రార్‌బాషా తలదూర్చి ఓవరాక్షన్‌ చేసి బాధితులపై దాడి చేయడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది.  బాధితురాలు రేణుక తెలిపిన మేరకు.. ఎస్బీఐ కాలనీలో జయరామిరెడ్డి, శివరామిరెడ్డిలకు చెందిన రెండు చికెన్‌ దుకాణాలు ఉన్నాయి. వీరి మధ్య వ్యాపార విషయంలో ఇటీవల విభేదాలు వచ్చాయి. 

శివరామిరెడ్డి తమ దుకాణంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జయరామిరెడ్డి బంధువులు ఇంటి వద్దకు ఆదివారం రాత్రి అడిగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న సీఐ అస్రార్‌బాషా గుమిగూడిన ప్రజలను చెదరగొట్టారు. ఈ క్రమంలో బాధితురాలు రేణుకను గొంతు పట్టుకొని షెట్టర్‌కు ఆనించి దాడి చేశారు. అక్కడే ఉన్న పూల వ్యాపారిని, రేణుక తమ్ముడు హేమేష్‌రెడ్డిలను రోడ్డుపైనే దాడి చేశారు. అనంతరం వారిని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ బయటి నుంచే తనను కొట్టుకుంటూ తీసుకెళ్లారని, స్టేషన్‌లోకి వెళ్లాక గొంతుపై, మెడపై బూటుకాలుతో తన్నారని హేమేష్‌రెడ్డి ఆరోపించారు. రోడ్డుపై సీఐ దాడి చేయడం అవమానంగా భావించిన రేణుక స్టేషన్‌ ఎదుటే పురుగు  మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఈ విషయంపై సీఐ అస్రార్‌బాషాను వివరణ కోరగా.. 30మంది దాకా ఎస్‌బీఐ కాలనీలో గుమిగూడి ఉన్నారని, వారిలో చాలా మంది తాగి ఉండటంతో ఘర్షణ జరుగుతోందని తెలిసి చెదరగొట్టామన్నారు. తాము, సిబ్బంది ఎవరిపైన దాడి చేయలేదని, ఇరువర్గాలపై చర్యలు తీసుకుంటామన్నారు.      

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)