Breaking News

అక్టోబర్‌లో నంది నాటకోత్సవాలు

Published on Tue, 07/11/2023 - 03:53

సాక్షి, అమరావతి: నంది నాటకోత్సవాలను అక్టోబర్‌ నెలలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్‌ అఫి­షియో సెక్రటరీ, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ తుమ్మా విజయ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో (రంగస్థల పురస్కారాలు) భాగంగా ఐదు విభాగాల్లో 73 అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

సోమవారం విజయవాడ ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నంది నాటకోత్సవాల నిర్వహణపై నాటక రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల లఘు నాటి­క, కళాశాల లేదా యూనివర్సిటీ లఘు నాటిక (ప్లేలెట్స్‌) అనే ఐదు విభాగాల్లో అవార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చామని, అనంతరం వారం రోజులు దరఖాస్తుల ఉపసంహరణకు కేటాయించామని తెలిపారు. అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని నంది నాటకోత్సవాలకు వేదికగా ఎంపిక చేస్తామని తెలిపారు.  

ప్రదర్శితమైన నాటకాలకే అవకాశం 
రాష్ట్రవ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు వివిధ నాటక సమాజాల ద్వారా ప్రదర్శించి­న నాటకాలను ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్న­ట్టు విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంట్రీలను న్యాయ నిర్ణేతల ద్వారా పరిశీలించి తుది పోటీలకు 10 పద్య నాటకాలు, 6 సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటి­కలు, 5 బాలల నాటికలు, 5 కళాశాల లేదా యూని­వ­ర్సిటీ యువత నాటికలను ఎంపిక చేస్తామన్నారు.

దరఖాస్తుల సంఖ్యను బట్టి వీటి సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తామ­ని తెలి­పా­రు. బాలలు, యువతకు సంబంధిం­చిన నాటకాలకు సంబంధించి ఈ ఏడా­ది కొత్తగా ప్రదర్శించిన వాటిని కూడా పరిగణలోకి తీ­సు­కుంటామన్నారు. ప్రదర్శన, ఎంపిక సమ­యంలో నాటకరంగ కళాకారులుండే ప్రాంతానికే వచ్చి తమ జ్యూరీ బృందం పరిశీలిస్తుందన్నారు.

సరికొత్త కథాంశాలతో మన సంస్కృతి సంప్రదాయాలను, మానవతా విలువలను, ఉన్నతమైన జీవనాన్ని ప్రతి­బింబించే అంశాలకు కళాకారులు ప్రా­ధా­న్యత ఇవ్వాలన్నారు. చివరిసారిగా 2017­లో నంది నాటకోత్సవాలు నిర్వహించామని, అనంతరం కరోనా విపత్కర పరిస్థితులతో నిర్వహిం­చలేకపోయామన్నారు. కళా­కా­రు­లకు ఆర్టీసి చార్జీల్లో రాయితీ ఇచ్చే విషయమై సంబంధిత విభాగంతో చర్చిస్తామన్నారు.

రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్‌ డెవ­లప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జీఎం ఎంవీఎల్‌ఎన్‌ శేషసాయి, కళారాధన సమితి కార్యదర్శి రవికృష్ణ నంద్యాల, సినీ రచయిత బుర్రా సా­యిమాధవ్‌ మాట్లాడారు. సమావేశం అనం­తరం ‘తెలు­గు పద్య­నా­టక రంగం– సాంకేతికత–సమకా­లీన అధ్యయనం’ అంశంపై ఆర్‌.నిరుపమ సు­నే­త్రి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)