Breaking News

రగిలిపోతున్న నల్లగొండువారిపల్లి

Published on Mon, 08/11/2025 - 05:38

పులివెందుల/వేంపల్లె:  వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉపఎన్నికలో  భాగంగా నల­్లగొండువారిపల్లి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాన్ని పక్క గ్రామంలోకి మార్చడంపై ఆ గ్రామస్తులు రగిలిపోతున్నారు. పులివెందుల మండల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి నల్లగొండువారిపల్లిలో 632 ఓట్లు ఉన్నాయి. గత పదేళ్లుగా ఈ గ్రామంలో పోలింగ్‌ బూత్‌ ఉండేది. స్థానికులంతా అక్కడే ఓటు హక్కు వినియోగించుకునే వారు. 

కానీ, వీరంతా ఇప్పుడు నల్లపురెడ్డిపల్లిలో ఓటు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదే పరిస్థితి ఎర్రబెల్లి ఓటర్లకు కూడా ఉత్పన్నౖ­మెంది. ఇక్కడి వారంతా నల్లపురెడ్డిపల్లికు వెళ్లి వేయాల్సిన దుస్థితి. నల్లపురెడ్డిపల్లి ఓటర్లు అటు నల్లగొండువారిపల్లి, ఇటు ఎర్రబెల్లి పోయి ఓటు వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో.. కలెక్టర్‌ చెరు­కూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ తీరుపై నల్ల­గొండువారిపల్లి గ్రామ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓడిపోతారనే భయంతోనే టీడీపీ కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. వారి ఆవేదన వారి మాటల్లోనే..

మా గ్రామంలోనే ఓటు వేసుకోనివ్వాలి
పోలింగ్‌ బూత్‌ను మా గ్రామంలో కాకుండా వేరే గ్రామానికి తరలించడం సరికాదు. అధికారులు అన్యాయం చేశారు. ఇప్పటికైనా మా గ్రామంలోనే మా ఓట్లు వేసుకునేలా చూడాలి.   – విశ్వనాథ్, నల్లగొండువారిపల్లి 

పోలింగ్‌ బూత్‌ను ఇక్కడే ఏర్పాటుచేయాలి  
నాకు 72 ఏళ్లు. ఎన్నో ఏళ్లుగా మా ఊరిలోనే ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. అలాంటిది.. ఇప్పుడెందుకు మార్పు చేస్తున్నారో అర్ధంకావడంలేదు. పోలింగ్‌ బూత్‌ను ఇక్కడే ఏర్పాటుచేయాలి. వేరే గ్రామానికి తరలించడం మంచిది కాదు.     – మస్తాన్, నల్లగొండువారిపల్లి

20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా లేదు 
గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూలేదు. ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలోని పక్క గ్రామానికి వెళ్లాలి. 20 ఏళ్లుగా నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.  – అర్జున్, నల్లగొండువారిపల్లి 

ఓడిపోతారనే భయంతోనే 
నల్లగొండువారిపల్లిలోనే పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటుచేయాలి. ఉన్నట్లుండి బూత్‌ను తరలించడం మంచి పద్ధతి కాదు. ఓడిపోతారనే భయంతోనే కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు.     – నరసింహారెడ్డి, నల్లగొండువారిపల్లి

వేరే గ్రామానికి మార్చడం మంచి పద్ధతి కాదు 
మా ఊరి పోలింగ్‌ బూత్‌ ఓటర్లను నల్లపురెడ్డిపల్లెకు మార్చడం సరికాదు. ఎన్నో ఏళ్ల నుంచి మా ఊరి పోలింగ్‌ కేంద్రంలోనే మా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు వేరే గ్రామానికి మార్చడం మంచి పద్ధతి కాదు.  – ఆదినారాయణ, నల్లగొండువారిపల్లి

అక్కడకెళ్లి ఓటు వేయాలంటే ఇబ్బందే
నల్లపురెడ్డిపల్లికు వెళ్లి ఓట్లు వేయాలంటే ఇబ్బందులు పడాలి. మా ఊర్లోని ఓటర్లను నల్లపురెడ్డిపల్లి పోలింగ్‌ కేంద్రానికి మార్చడంవల్ల పోలింగ్‌ రోజు వ్యయ ప్రయాసలు అవుతాయి. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు.  – చెన్నకేశవరెడ్డి, నల్లగొండువారిపల్లి

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)