Breaking News

వైఎస్‌ జగన్‌ పులిబిడ్డ: నైనా జైస్వాల్‌

Published on Mon, 04/15/2024 - 04:12

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాల నడుమ విజయం సాధించారని, ఇటీవలే ఆయన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఒక పులిబిడ్డను చూసిన ఫీలింగ్‌ కలిగిందని జాతీయ స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ వ్యాఖ్యానించారు. ‘ఆయన నవ్వు, చూపిన అభిమానం పలకరింపులోని స్వచ్ఛత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అని చెప్పారు.అటు చదువు ఇటు ఆటల్లోనూ రాణిస్తూ పిన్న వయసులోనే అద్భుతాలు లిఖిస్తూ ఏ రికార్డు కైనా చిరునామా అన్నట్టుగా మారిన యువ క్రీడా సంచలనం నైనా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధం గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విలక్షణ వ్యక్తిత్వంపై పలు విషయాలు పంచుకున్నారు ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా అమలు చేసిన ‘ఆడుదాం – ఆంధ్రా’ కార్యక్రమం అద్భుతం. ఒక క్రీడాకారిణిగా ఔత్సాహిక క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. నాకు అన్ని విధాలుగా మా తల్లిదండ్రుల మద్దతు పుష్కలంగా ఉండడం వల్ల నేను పెద్దగా సమస్యలు ఎదుర్కోనప్పటికీ... నా ఈడు వాళ్లు ఆరి్థకంగా, శిక్షణ, వసతుల పరంగా ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకుని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం  చేపట్టడం హర్షణీయం.    

ఆంధ్రప్రదేశ్‌తో అల్లుకున్న అనుబంధం...  
పుట్టింది హైదరాబాద్‌ అయినా కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌తో నా అనుబంధం అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. ఏపీలో అనేక క్రీడా పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. మోటివేషనల్‌ స్పీకర్‌గానూ ఇక్కడి కళాశాలల్లో, ఈవెంట్స్‌లో ప్రసంగించాను. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా పనిచేశాను. అప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధిని గమనించాను. 

ఆడపిల్లలకు ‘దిశ’తో సంపూర్ణ రక్షణ 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చట్టం తీసుకురావడం మంచి పరిణామం. అద్భుతమైన పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం...అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దిశ యాప్‌ను రూపొందించడం ఇవన్నీ స్వాగతించదగ్గ మార్పులు.  

నవరత్నాలు.. మెరుపులు 
అమ్మ ఒడి పథకం వచి్చన తర్వాత పేదపిల్లలు చదువుకోవడం నేను గమనించాను. కేవలం పిల్లల్ని స్కూల్‌కి వచ్చేలా చేస్తే సరిపోదు. అందుకే  నాడు నేడు ద్వారా స్కూల్స్‌ని కూడా అభివద్ధి చేయడం కూడా దానికి అనుబంధమైన అవసరమైన ఆలోచన. ఈ పథకం విజయం గమనించిన తర్వాత మహిళల స్వయం ఉపాధి, చేయూత వంటి పధకాలు నాకు బాగా నచ్చాయి. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ని కలిసినప్పుడు ఆయన మాతో సంభాషించిన తీరు ఎంత చెప్పినా సరిపోదు. ఆయన్ను కలవడం నా జీవితంలో మ ర్చిపోలేని జ్ఞాపకం.

ము ఖ్యంగా ఆయన నవ్వు..ఓ వెపన్‌ అని చెప్పాలి. మనం ఏ స్థాయికి చేరుకున్నా, ఎదుటివారిని చూసి అభి మానంగా నవ్వగలిగితే అదే వారికి మనం ఇచ్చే అందమైన బహుమతి. అలాగే కాన్ఫిడెన్స్, ఫైటింగ్‌ డెడికేషన్, డైనమిజమ్‌ వంటివన్నీ క్రీడాకారుల్లో కనిపించే లక్షణా లు. అవన్నీ ఆయనలో నాకు కనిపించాయి. క్రీడలు, మహిళల ఉపాధి వంటి విషయాల్లో నా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం.  – సాక్షి, అమరావతి

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)