Breaking News

శివుని సేవలో నాగుపాము.. వీడియో వైర‌ల్‌

Published on Thu, 02/13/2025 - 13:06

విశాఖపట్నం: నగరంలోని ఎగువ రెల్లివీధిలో వెలసిన శివాలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. మాఘ పౌర్ణమి పుణ్యదినాన నాగసర్పం ఒకటి శివలింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చింది. సుమారు 20 నిమిషాల పాటు ఆలయంలో సంచరించిన నాగేంద్రుడు చేసిన విన్యాసాలు భక్తులను పరవశింపజేశాయి. మాఘ పౌర్ణమి రోజున మహాశివుని దర్శనంతో పాటు నాగేంద్రుడు స్వయంగా స్వామి భక్తిని ప్రదర్శించడం కనులారా చూశామని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.  

మూడేళ్ల కిందట వెలుగులోకి..  
సుమారు మూడేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన సమయంలో ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. దశమంతుల మాణిక్యాలరావు(వైఎస్సార్‌ సీపీ నాయకుడు) ఇంటి సమీపంలో కొండచరియలు విరిగిపడగా, శివలింగాన్ని ఆయనే గుర్తించారు. అప్పట్లో ఆ శివలింగం చుట్టూ మూడు, నాలుగు పాములు సంచరించేవి అని, కొంత సమయం తర్వాత వాటంతట అవే వెళ్లిపోయేవని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని పూజారి దృష్టికి తీసుకువెళ్లగా, శివలింగం ఎక్కడ లభించిందో అక్కడే ప్రతిష్టించాలని సూచించారు. దీంతో మాణిక్యాలరావు ఆ ప్రదేశంలోనే శివాలయాన్ని నిర్మించారు.

శివలింగంతో పాటు పార్వతీ సమేత గణనాథుని విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో తరచూ పాములు ఆలయంలోకి వస్తుంటాయని, అయితే అవి ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదని మాణిక్యాలరావు తెలిపారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో నాగుపాము ఆలయంలోకి ప్రవేశించడాన్ని మాణిక్యాలరావు స్వయంగా చూసి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఆ పాము శివాలయం ప్రాంగణమంతా కలియతిరుగుతూ, పార్వతీ సమేత గణనాథుడి విగ్రహం వద్ద, శివుని చిత్రపటం వద్ద పడగ విప్పి కొంతసేపు నిలబడిందన్నారు. సుమారు 10 నిమిషాల పాటు శివలింగానికి చుట్టుకుని కనిపించిందని ఆయన వివరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

 

Videos

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!