Breaking News

మీ మద్యం దుకాణం ఉండటానికి వీల్లేదు

Published on Tue, 08/19/2025 - 04:40

సాక్షి టాస్క్ ఫోర్స్‌: కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణంపై నగరి ఎమ్మెల్యే బంధువులు దౌర్జన్యానికి దిగారు. తమ మద్యం దుకాణానికే అడ్డు ఉండకూడదని వారికి హుకుం జారీ చేశారు. మరో చోట మద్యం దుకాణం ఏర్పాటు చేసుకుంటే.. అక్కడ మరో వైన్‌ షాపు యజమాని గీత కార్మికులపై దాడి చేశారు. ఆపై గౌడ మద్యం దుకాణానికి తాళం వేశారు. గత నెలలో జరిగిన ఘటన తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథ­నం మేరకు..ప్రభుత్వం గీత కార్మికుల కోటాలోని మద్యం దుకా­ణం కోసం అతిరాల నారాయణ  మూడు చోట్ల దరఖాస్తు చేసు­కు­న్నారు. నగరి నియో­జకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో మ­ద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతులు పొందారు.

పుత్తూరు సమీపంలో ఫిబ్రవరి 2న గౌడ మద్యం దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ ఒత్తిడి మేరకు ఎక్సైజ్‌ అధికారులు మద్యం దుకాణాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. ఆ తరువాత విష్ణుమహల్‌ సమీపంలో మ­ద్యం దుకా­ణం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అక్కడ కూడా వీల్లేదని ఎమ్మె­ల్యే ఎక్సైజ్‌ అధికారులపై ఒత్తిడి చేశారు. ఎక్సైజ్‌ ఉన్నతాధికారి సలహా మేరకు పుత్తూరు–­కార్వేటినగరం మార్గంలో కళ్యాణపురం వద్ద ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అక్క­డ వ్యాపారం చేస్తుండగా సమీపంలోని గంగా వైన్స్‌ యజమాని దౌర్జన్యం మొదలైంది.

గౌడ వైన్స్‌ని తొలగించాలని ఒత్తిడి చేశా­రు. తొలగించకపోవటంతో దాడికి తెగబడి, దుకాణానికి తాళం వేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 2 రోజుల తరువాత గౌడ సంఘం సహకారంతో తాళాలు పగుల­గొట్టి మద్యం దుకాణం నుంచి వ్యాపారం ప్రారంభించారు. 2 రోజుల తరువాత గంగా వైన్స్‌ యాజమాన్యం వర్గీయులు గౌడ మద్యం దుకాణం ఫ్లెక్సీలు, విద్యుత్‌ లైట్లను ధ్వంసం చేశారు. వ్యాపారం జరగనివ్వకుండా అరాచకం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని నారాయణ సోమవారం ఫిర్యాదు చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)