రైతులకు ప్రభుత్వం సహకరించడం లేదు

Published on Fri, 11/29/2024 - 05:36

గుడ్లవల్లేరు/పామర్రు/గూడూరు(పెడన)/గుడివాడ రూరల్‌: ధాన్యం కొనుగోళ్లపై సమస్యలు తెలు­సుకునేందుకు గురువారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కృష్ణాజిల్లాలోని పలు మండలాల్లో పర్యటించగా రైతులు సమస్యలను ఏకరవు పెట్టారు. తు­పాను గండం నుంచి బయటపడాలని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళితే... అక్కడ గోనె సంచులు లేవని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధాన­మిస్తున్నారని, మిల్లర్లు తేమ శాతం ఎంత చెబితే... అంతమేరకు కట్‌ చేసి తమకు రావాల్సిన ధాన్యం సొమ్ములో కోత విధి­స్తున్నారని గుడ్లవల్లేరు మండలంలోని రైతులు ఫిర్యాదు చేశారు. 

ఎంటీయూ 1262 రకం ధాన్యా­న్ని మిల్లర్లు తీసుకోవ­డం లేదని పామర్రు మండలంలోని కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లోని రైతులు ఫిర్యాదు చేశారు. ధాన్యం విక్రయించడంలో తమకు ప్రభుత్వం సహకరించడం లేదని గూడూ­రు మండలం, తరకటూరు రైతులు మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి చెందిన మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు కాట్రగడ్డ కృష్ణ మాట్లాడుతూ  ధాన్యం సేకరణలో ప్రభుత్వం రైతు­లకు సహకరించడం లేదని, తాను కూడా బస్తా రూ.1400 చొప్పున మిల్లర్లకు విక్రయించాల్సి వ­చ్చిందని చెప్పారు.

ప్రభుత్వం తరఫున రైతుల ద­గ్గరకు ఏ అధి­కారీ రాలేదని,  తనతో పాటుగా ఇక్క­డి రైతు­లంతా బస్తా రూ.1300 నుంచి రూ.­1400­కు దళారులకు అమ్ముకున్నట్టు తెలిపారు. మరో రైతు అయ్యప్ప మాట్లాడుతూ.. తనకు 20 ఎకరాల పొలం ఉందని, పంట కోశాక రైతు సేవా కేంద్రా­నికి తీసుకెళ్లినా ఫలితం లేదని, ఆర్‌ఎస్‌కేలో సాంకేతిక సిబ్బంది లేరంటూ పంట వెనక్కి పంపారని, గత్యంతరం లేక పది ఎకరాల్లోని పంట దళారు­లకు బస్తా రూ.1400 చొప్పున అమ్మినట్టు మంత్రికి వివరించారు. 

మంత్రి నాదెండ్ల మాట్లా­డుతూ వాతావరణంలో మార్పుల దృష్ట్యా 40 రో­జుల్లో చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను 4 రోజుల్లో చేపట్టేలా చర్యలు తీసుకు­న్నామని, 24 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా రైస్‌ మిల్లరను ఆదేశించినట్లు తెలిపారు. 

Videos

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)