Breaking News

మయన్మార్‌లో నరకం చూస్తున్నాం

Published on Mon, 07/27/2026 - 05:48

తాడేపల్లి రూరల్‌: మయన్మార్‌లో నరకం చవిచూస్తున్నామని, సైబర్‌ నేరస్తుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే తమను రక్షించాలని వేడుకున్నారు. ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మయన్మార్‌ వెళ్లి అక్కడ సైబర్‌ నేరస్తుల చేతిలో చిక్కుకున్న బాధితులు ఆదివారం వాట్సాప్‌ కాల్‌ ద్వారా ‘సాక్షి’తో తమ కష్టాలు చెప్పుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, అనంతపురం, విశాఖ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలకు చెందిన బాధితులతోపాటు తెలంగాణకు చెందిన మొత్తం 24 మంది సాక్షితో మాట్లాడారు. కేజీఎఫ్‌ సినిమాలో మాదిరి తమను బంధించి 18 గంటలు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, సైబర్‌ నేరాలు చేయాలని చిత్రహింసలు పెడుతున్నారని కన్నీరుమున్నీరయ్యారు. పనిచేసే సమయంలో చిన్న కునుకు తీసినా సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా కొడుతున్నారని, భారీగా ఫైన్లు వేస్తున్నారని చెప్పారు.ఫైన్‌ కట్టకపోతే గుంజీలు తీయించి చిత్ర హింసలు పెట్టి జీతాల్లో కట్‌ చేస్తున్నారని ఆవేదన చెందారు. 

యువతులను అసభ్యంగా తాకుతూ నరకం చూపుతున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారని వివరించారు. భారత్‌కు వెళ్లాలంటే భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని రోదించారు. తమకు ఫోన్‌లు కూడా ఇవ్వడం లేదని, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ అమ్మాయి సెక్యూరిటీని మభ్యపెట్టి ఫోన్‌ ఇస్తే దాని ద్వారా మాట్లాడుతున్నామని వివరించారు. జీతంలో రూ.20­వేలే చేతికి ఇస్తున్నారని, తిండికీ డబ్బులు తీసుకుంటున్నారని, రెండు ఆఫ్‌లెగ్‌ చికెన్‌ జాయింట్లకు రూ.600. ఒక యాపిల్‌ పండుకు రూ.150, ఒక అరటిపండుకి రూ.60 వసూలు చేస్తున్నారని భోరుమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే రక్షించాలని వేడుకు­న్నారు. వందలమంది బాధితులున్నారని, తమ బా­ధ­ల­ను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)