Breaking News

మటన్‌ డబ్బులు అడిగారని..

Published on Thu, 01/16/2025 - 08:36

తిరుపతి రూరల్‌ : మటన్‌ తీసుకెళ్లి మూడు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో అడిగేందుకు వెళ్లిన దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి మల్లంగుంటలో జరిగింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.. మల్లంగుంట పంచాయతీ వినాయకనగర్‌కు చెందిన కేశవులు, హేమలత దంపతులు మటన్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన వినాయక అనే వ్యక్తి మటన్‌ తీసుకెళ్లి రూ.1200 అప్పు పెట్టాడు. ఈ క్రమంలో కేశవులు, హేమలత దంపతులు సోమవారం రాత్రి వినాయక ఇంటికి వెళ్లి డబ్బులు అడగడంతో ఆగ్రహించిన వినాయక కుమారులు ప్రదీప్‌, సందీప్‌, మరో వ్యక్తి కలిసి ఇనుపరాడ్‌తో దాడి చేశారు. 

హేమలత మెడలోని 32 గ్రాముల బంగారు చైన్‌ లాక్కున్నారు. రక్తగాయాలతో పడి ఉన్న బాధితులు స్థానికులు చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. మంగళవారం బాధితుడు కేశవులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)