Breaking News

ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యుటేషన్లు

Published on Wed, 11/01/2023 - 03:57

సాక్షి, అమరావతి:  మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యుటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. జిరా­క్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యుటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. ఒరిజినల్‌ డాక్యుమెంట్లను తహసీల్దార్లు ధృవీకరించాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

తహశీల్దార్లు ప్రతి మ్యుటేషన్‌కు తప్పనిసరిగా సేల్‌ డీడ్‌ వంటి ఒరిజినల్‌ డాక్యుమెంట్లు, వాటి ఒరిజినల్‌ లింకు డాక్యుమెంట్లు, ఒరిజినల్‌ ఈసీతోపాటు దానికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తహసీల్దార్‌ ఆన్‌లైన్‌లో ధృవీకరించాలని (సర్టిఫై చేయాలి) ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వర్‌ నుంచి ఆన్‌లైన్‌లో చూసే డాక్యుమెంట్లు తప్ప ఇతర ఏ సందర్భంలోనైనా ఈ విధానం పాటించాల్సిందేనని చెప్పారు.

ఇండియన్‌ ఎవిడెన్స్‌ చట్టం ప్రకారం ఒరిజినల్‌ డాక్యుమెంట్లని ధృవీకరించకుండా చేసిన ఎలాంటి మ్యుటేషన్‌ లేదా ఆర్డర్‌ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల తహశీల్దార్లు ఫొటో కాపీల ఆధారంగా మ్యుటేషన్లు చేయడం, అసలైన యజమానులు ఫిర్యాదుతో అవి సరైన పత్రాలు కావని నిర్థారణ అయిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో సీసీఎల్‌ఏ ఈ ఆదేశాలు జారీ చేశారు.  

రెవెన్యూ శాఖలోని చివరి వ్యక్తి నుంచి అన్ని స్థాయిల్లో ఈ నిబంధనలు పాటించాలని, దీనికి విరుద్ధంగా ఎవరైనా ఫొటో కాపీలు చూసి మ్యుటేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాక్ట్‌ 15 ఆఫ్‌ 2022 ప్రకారం క్రిమినల్‌ లా కింద ఎవరైనా ఆర్‌ఓఆర్‌ చట్టానికి విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వారిని జిల్లా కలెక్టర్లు విచారించే అధికారం ఉందని తెలిపారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)