Breaking News

ఆకాశ గంగను ఒడిసిపట్టిన భగీరథి

Published on Tue, 11/18/2025 - 04:12

పీసీ పల్లి: నిత్యం కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతం. అరకొరగా అందే భూగర్భ జలాలూ ఫ్లోరైడ్‌­తో నిండిపోయి తాగేందుకు పనికిరాని దుస్థితి. గుక్కెడు నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిందే. ఇ­లాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం మురు­గమ్మి(Murugammi) గ్రామం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులతో వర్షపు నీటిని ఒడిసిపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే 2వ ఉత్త­మ నీటి సంరక్షణ పంచాయతీగా ఎంపికైంది. స­ర్పంచ్‌ సుబ్బరత్నమ్మ మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర­పతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.  

వైఎస్‌ జగన్‌ సహకారంతో కల సాకారం 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021–24 మధ్య మురుగమ్మి పంచాయతీ సర్పంచ్‌ సుబ్బరత్నమ్మ అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ఆయన సహకారంతో గ్రామంలో 47కుపైగా వాటర్‌òÙడ్‌ పథకాలను చేపట్టారు. పంచాయతీలో సుమారు రూ.కోటికి పైగా నిధులు వెచి్చంచి నీటికుంటలు, ఊట కుంటలు, చెక్‌ డ్యాంలు నిర్మించారు. కొండ చుట్టూ కందకాలు తీయించారు. కొండ మీద పడిన వర్షపు నీరు ఎక్కడికి అక్కడ ఆగి భూమిలోకి ఇంకేటట్లు రెండు కందకాలు రూ.2 లక్షలతో తవ్విచారు.

వర్షం నీరు ఎటువైపు వాలు ఉంటే అటు ప్రవహిస్తూ ఒకచోట ఇంకేటట్టు రూ.27 లక్షలు వెచ్చించి 16 చిన్న ఊట కుంటలు తీశారు. 21 డక్‌ అవుట్‌ పాండ్‌లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.35 లక్షలు ఖర్చు చేశారు. ‘అమృత సరోవర్‌’ పేరిట నీరు ఎక్కువగా ప్రవహించే ఏటవాలు ప్రాంతంలో కుంటతీసి చుట్టూ పెద్ద కందకం ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల వర్షాకాలంలో వాటర్‌ షెడ్‌ పథకాల్లో గణనీయంగా నీరు చేరింది. దీంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల బోర్లలో భూగర్భ నీటిశాతం గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు వరి, శనగ, పొగాకు వంటి పంటలు సాగు చేశారు. అంతేకాకుండా కొత్త నీరు చేరడంతో నీటిలో గతంలో అధికంగా ఉండే ఫ్లోరైడ్‌ శాతం తగ్గుముఖం పట్టింది.  

నా కష్టం.. జగనన్న ఆశయం ఫలించాయి 
2021–24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులు సంతోషంగా ఉండాలని, పల్లెలు పంటలతో కళకళలాడాలని కోరుకునేవారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్విని­యోగం కాకుండా పంచాయతీల్లో వాటర్‌ షెడ్‌ పథకాలు పెద్ద ఎత్తున నిర్మించాను. నా కష్టం.. జగనన్న ఆశయం నెరవేరి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లోని బోర్లలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. నా కష్టాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.  – సుబ్బరత్నమ్మ, సర్పంచ్, అవార్డు గ్రహీత, మురుగమ్మి 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)