Breaking News

టిడ్కో గృహ రుణాల రద్దు కుదరదు..

Published on Sun, 09/07/2025 - 03:46

కర్నూలు(సెంట్రల్‌): టిడ్కో గృహ రుణాలను రద్దు చేయడం కుదరదని మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం కర్నూలులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాల్లో నివాసముంటున్న పేద మహిళలు తాము గృహాల రుణాలను కట్టలేకపోతున్నామని, బ్యాంకులు వేధిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, వాటిని రద్దు చేయాలని నారాయణకు మొరపెట్టుకున్నారు. 

దీనిపై మంత్రి స్పందిస్తూ..‘అదేమీ కుదరదు. బ్యాంకులకు రుణం కట్టాల్సిందే. లేకపోతే ఇబ్బందులు పడతారు’ అని అన్నారు. దీంతో మహిళలంతా షాక్‌ తిన్నారు. నారాయణ మాట్లాడుతూ 2026 మార్చి ఆఖరిలోపు 7 లక్షల టిడ్కో గృహాలను పూర్తి చేస్తామని చెప్పారు. కర్నూలు టిడ్కో గృహాల సముదాయంలో 10 ఎకరాలను టీజీ భరత్‌కు ఇస్తామని, ఆయన అక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసి 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. 

‘కూడా’ పరిధిలో మునిసిపల్‌ ఆస్తుల వేలం 
ప్రభుత్వంపై భారం లేకుండా పాలన చేసేందుకుగాను కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (కూడా) పరిధిలోని మునిసిపల్‌ ఆస్తుల వేలానికి మంత్రి నారాయణ అనుమతిచ్చారని టీజీ భరత్‌ చెప్పారు. వేలం ద్వారా వచ్చే ఆదాయంతో కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)