Breaking News

హోమ్‌ ఓటింగ్‌.. పోలింగ్‌ స్టేషన్‌..

Published on Tue, 04/02/2024 - 04:55

సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా మన రాష్ట్రంలో కల్పిస్తున్న ఇంటి వద్ద నుంచే ఓటింగ్‌ హక్కుపైన, పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు పోలింగ్‌స్టేషన్‌కు వచ్చి­గానీ, ఇంటివద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ అండ్‌ హోం ఓటింగ్‌కు సన్నద్ధత, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై సోమవారం సచివాలయం నుంచి మీనా జిల్లాల ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా రిటర్నింగ్‌ ఆఫీసరుకు ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఒకసారి ఇంటివద్ద నుంచే ఓటువేసే అవకాశం పొందితే వారు నేరుగా పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతారన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేవారి కోసం వీడియో గ్రాఫర్‌తో, అయిదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే వివిధ శాఖల ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రిటర్నింగ్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్‌ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు హోమ్‌ ఓటింగ్, పోస్టల్‌ బ్యాలెట్లకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవో ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)