Breaking News

వివేకా కేసు: ఎంపీ అవినాష్‌ రెడ్డి ఫుల్ వీడియో

Published on Thu, 04/27/2023 - 13:36

సాక్షి, వైఎ‍స్సార్‌: వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్యకు సంబంధించి తన దగ్గరున్న సమాచారంతో ఎంపీ అవినాష్‌ రెడ్డి ఓ వీడియో రిలీజ్‌ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్‌ రెడ్డి వీడియోను విడుదల చేశారు. 

వివేకా లెటర్‌ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్‌ పెట్టడం లేదు? సీబీఐ అధికారి రాంసింగ్‌ ఎవరిని కాపాడుతున్నారు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? అన్న వివరాలను అవినాష్ రెడ్డి ఇందులో వివరించారు.

"వివేకా హత్య తర్వాత శివప్రకాష్‌ రెడ్డి నాకు ఫోన్‌ చేశారు. నేను పులివెందుల రింగ్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. వివేకా మరణించినట్టు శివప్రకాష్‌ రెడ్డే నాకు చెప్పారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని వివేకా పీఏ కృష్ణారెడ్డిని అడిగాను. ఎలాంటి అనుమానాలు లేవని వివేకా పీఏ చెప్పారు. మేము వెళ్లకముందే వివేకా రాసిన లేఖ, మొబైల్ దాచిపెట్టమని హైదరాబాద్ నుంచి సునీత భర్త ఫోన్ లో ఆదేశించారు. డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని వివేకా లెటర్‌లో రాశారు. 

హత్య అని తేల్చే లేఖను ఎలా దాచిపెడతారు? లెటర్ దాచిపెట్టమని నేనే చెప్పానని సునీత పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వివేకా చనిపోయారు, చాలా బ్లడ్ ఉందని మాత్రమే నేను సీబీఐకి చెప్పాను. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలి. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దనే.. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నామని" అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: సీబీఐ స్టేట్‌మెంట్‌లో వివేకా రెండో భార్య షమీమ్‌ సంచలన విషయాలు

వివేకా కుటుంబానికి హత్య విషయం తెలిసినా చాలా సేపటివరకు మౌనంగా ఉన్నారని, హత్య విషయం తెలిసినా వెంటనే ఎందుకు పోలీసులకు చెప్పలేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. వివేకా కుటుంబం  మౌనంగా ఉండడం.. పోలీసులకు చెప్పకపోవడం వెనక అనుమానాలున్నాయని అన్నారు. ఆ కోణంలో సిబిఐ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని, తనను ఇరికించేందుకే సిబిఐ కుట్ర పన్నినట్లు తెలుస్తోందని, ఈ  కేసులో అన్ని విషయాలు నిజాయతీగా నిగ్గుతేలాల్సిన అవసరం ఉందని అన్నారు అవినాష్ రెడ్డి. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?