Breaking News

ఈ యాప్‌లో సినిమాలు రిలీజ్‌ 

Published on Fri, 06/16/2023 - 05:13

సాక్షి, అమరావతి: త్వరలోనే ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) ఒక యాప్‌ను రూ­పొందిస్తుందని, ఇకపై ఆ యాప్‌ ద్వారా పాత, కొత్త సినిమాలను కూడా వీక్షించే అవకాశం లభిస్తుందని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి గురువారం చెప్పారు. ఇటీవల విశాఖలో ‘నిరీక్షణ’అనే సినిమాతో రిలీజ్‌ రోజే థియేటర్‌లో మాదిరిగా కొత్త సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే విధానాన్ని ప్రవేశపెట్టామని..దానికి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు.

ఈ స్ఫూర్తితో ఏపీ ఫైబర్‌నెట్‌ జూన్‌ 16న రూ.39 కే ‘లవ్‌ యూ టూ’ చిత్రాన్ని అందిస్తోందని, దీన్ని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు వివరించారు. సబ్‌స్రై్కబ్‌ చేసు­కున్న తర్వాత 24 గంట­ల వరకు ఈ సినిమాను చూడవచ్చని చె­ప్పారు. చిన్న చిత్రాల నిర్మాతలను ప్రోత్సహిం­చి, వీక్షకుడికి అతి తక్కువ ధరకే నేరుగా సి­నిమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ వి­ధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చా­మ­­ని ఇది ఓటీ­టీలకు, థియేటర్ల యాజమాన్యానికి పోటీ కాదన్నారు.

రూ.100 కోట్ల బడ్జెట్‌ మూవీకి మొదటి వారంపాటు టి­కె­ట్‌ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పిం­చే వి­­ధంగా ప్రభుత్వం జీవో 13ను తీసుకువచ్చిం­దని గుర్తు చేశారు. రూ.20 కోట్లలోపు నిర్మించిన సినిమాలను చిన్న చిత్రాలుగా భావిస్తూ వాటిని కూడా పండుగ రోజుల్లో ప్రతి థియేటర్‌లో పెద్ద చిత్రంతో పాటు ఒక షో చిన్న చిత్రానికి కేటాయించే అవకాశం కల్పించామన్నారు. రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తామన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)