Breaking News

మద్యం మత్తులో వేధిస్తున్న కుమారుడిని హత్యచేసిన తల్లి

Published on Wed, 07/22/2026 - 04:38

చల్లపల్లి: తాను ఏరోజైతే బిడ్డకు జన్మనిచ్చిందో అదే రోజు ఆ తల్లి కొడుకుని కొట్టి చంపింది.  మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పింది. కృష్ణాజిల్లా, చల్లపల్లిలో ఈ ఘటన  చోటు­చేసుకుంది. చల్లపల్లి పడమర వీధిలో నివాసం ఉంటున్న మోతుకూరి నాగమణికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శివ ఏసీ రిపేర్‌ పని చేసుకుంటూ కొన్నేళ్లుగా దూరంగా వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాగమణి పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్‌(35) వద్దే ఉంటోంది. అతడు ముఠాపని, డెలివరీ బాయ్‌గా పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్‌ తరచూ తల్లితో గొడవపడేవాడు. 

ఇదే క్రమంలో సోమవారం రాత్రి కూడా ఇంట్లో తల్లీకొడుకులు ఇద్దరూ వాదులాడుకున్నారు. తెల్లారిన తరువాత నాగమణి తన పనులు చేసుకుంటూ ఇరుగుపొరుగు వారితో సాధారణంగానే మాట్లాడింది. 10.30 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. రాత్రి తాను, తన కొడుకు దుర్గాప్రసాద్‌ గొడవ పడ్డామని, సహనం నశించి బలమైన వస్తువుతో కొట్టగా తన కొడుకు చనిపోయాడని పోలీసులకు చెప్పింది. అవాక్కయిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా దుర్గాప్రసాద్‌ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.

తలపై ఇనుప రాడ్డుతో కొట్టిన గాయాలు ఏడు నుంచి తొమ్మిది వరకూ గాట్లు ఉన్నట్లు తెలిసింది. చల్లపల్లి పోలీసులు వివరాలు, ఆధారాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతుడు దుర్గాప్రసాద్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్లో దొరికిన వివరాలను బట్టి అతను జూలై 20, 1991న జన్మించాడు. పుట్టిన రోజునాడే జన్మనిచ్చిన తల్లి చేతిలోనే దుర్గాప్రసాద్‌ హతమయ్యాడు.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి