Breaking News

మైక్రో ఫైనాన్స్‌ వేధింపులకు తల్లీకొడుకు బలి

Published on Wed, 06/03/2026 - 04:44

హిందూపురం: వ్యాపారం కలిసిరాక.. సర్కారు ఆదుకోక.. ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. వ్యా­పా­రం కోసం అప్పు తీసుకున్న పాపానికి మైక్రోఫైనాన్స్‌ ప్రతినిధులు నరకం చూపారు. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో ఆ తల్లి బలవన్మరణానికి తెగించింది. విషగుళికలు కలుపుకున్న కూల్‌డ్రింక్‌ను తాను తాగి కొడుకూ, కూతురికీ తాగించింది. తల్లీకొడుకు మృతిచెందగా, కూతురు చావు­బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.  శ్రీసత్య­సాయి జిల్లా హిందూపురం మండలం బీరేపల్లిలో మంగళవారం జరిగిన ఈ ఘటన గుండెలను పిండేసింది.

వ్యాపారం సాగక.. సర్కార్‌ సాయం అందక 
బీరేపల్లికి చెందిన ముద్దప్పకు భార్య లక్ష్మి (35), కుమారుడు రిషికుమార్‌ (13), కుమార్తె శ్రీనిధి ఉన్నారు. ముద్దప్ప భార్యతో కలిసి చిరుధాన్యాలను సంతల్లో విక్రయించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. వైఎస్సార్‌ సీపీ హయాంలో వివిధ పథకాల కింద ఆర్థిక సాయం అందేది. అలాగే ముద్దప్ప భార్య లక్ష్మి డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు సంఘం సాయంగా నిలిచేది.  రెండేళ్లుగా ముద్దప్ప కుటుంబానికి సర్కారు నుంచి సాయం అందడంలేదు. 

మరోవైపు వ్యాపారమూ జరగడం లేదు. దీంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బంది కావడంతో ముద్దప్ప తొలుత ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేశాడు. అయితే రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మైక్రో ఫైనాన్స్‌ సంస్థను ఆశ్రయించాడు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడక అప్పులు వడ్డీతో కలిపి భారంగా మారాయి. ఈ క్రమంలోనే కుటుంబంలోనూ మనశ్సాంతి కరువైంది. మైక్రో ఫైనాన్స్‌ సంస్థకు చెల్లించాల్సిన అప్పు తలచుకుని ముద్దప్ప నిత్యం ఆందోళన చెందేవాడు. 

ఇది చూసి భార్య లక్ష్మి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని భావించిన ఆమె మంగళవారం కూల్‌డ్రింక్‌ తీసుకురావాలని భర్తను కోరింది. ముద్దప్ప తెచ్చిన కూల్‌డ్రింక్‌లో అప్పటికే తెచ్చిపెట్టుకున్న విషపు గుళికలను కలిసి తాను తాగడంతోపాటు కుమారుడు రిషికుమార్, కుమార్తె శ్రీనిధికీ తాగించింది. శ్రీనిధి వాంతులు చేసుకోగా, తల్లీకుమారుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. 

కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న ముద్దప్పకు భార్యాకుమారుడు విగతజీవులు­గా కనిపించారు. కుమార్తె శ్రీనిధి­ని గ్రామస్తుల సాయంతో ఆసుపత్రికి తరలించాడు. ప్రసు­త్తం ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. విష­యం తెలుసుకున్న హిందూపురం వైఎ­స్సా­ర్‌సీపీ నియోజకవర్గ ముఖ్య­నేతలు గుడ్డంపల్లి వేణురెడ్డి, పార్టీ నాయకులు వెళ్లి  ముద్దప్పకు ధైర్యం చెప్పారు. హిందూపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)