Breaking News

మల్లన్నకు పొందూరు పాగా

Published on Mon, 02/24/2025 - 06:05

మహా శివరాత్రి వస్తోందంటే చాలు ఆ గ్రామాల్లో ఒకటే సందడి. దాదాపు ఒకటిన్నర నెలల ముందే అక్కడి చేనేత కార్మికులందరూ మిగతా అన్ని కార్యక్రమాలు పక్కనపెట్టేసి ఒకే ఒక్క కార్యక్రమంపై దృష్టి పెడతారు. అదే శ్రీశైల మల్లన్న స్వామికి సమర్పించేందుకు ప్రత్యేక వస్త్రం తయారీ. నేత పని పూర్తయిన తరువాత ప్రత్యేక పూజలు ఊరేగింపులు నిర్వహించి ప్రత్యేక వస్త్రాన్ని శ్రీశైలానికి తీసుకువెళతారు. ఈ పుణ్యక్రతువు పూర్తయింది. ప్రత్యేక వస్త్రం శ్రీశైలానికి బయల్దేరింది.  

పరమ పవిత్రమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామికి శివరాత్రికి సిక్కోలు.. తలపాగాలు, ఇతర వ్రస్తాలు పంపనుంది. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా తలపాగా వస్త్రాలు పంపించేందుకు పొందూరుతో పాటు జిల్లా నుంచి పలు ఊళ్లు సిద్ధమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో పొందూరు, బూర్జ, ఆమదాలవలస, ఉప్పెనవలస, లావేరు గ్రామాల  నుంచి వ్రస్తాలను శివరాత్రికి మల్లికార్జున స్వామికి సమర్పించనున్నారు.  

ఈ ఏడాది స్థానిక చేనేతవాడకు చెందిన బనిశెట్టి శ్రీనివాసరావు పొందూరు నుంచి తలపాగాను సమర్పించనున్నారు. చేనేత, జౌళి శాఖ ద్వారా బనిశెట్టి శ్రీనివాసరావు తలపాగా వస్త్రాలను శ్రీశైలం మల్లన్నకు సమర్పించడానికి దరఖాస్తులు చేసుకున్నారు. బనిశెట్టి ఆంజనేయులు మూడు తలపాగా వస్త్రాలను గుడివాడ, ఒంగోలు, వెంకటగిరి వాళ్లకు నేశారు. శివయ్యకు తలపాగా, అమ్మవారికి చీర, శనగల బసవన్న, వినాయకుడికి పంచె, నవనందులను, గాలి గోపురాన్ని అలంకరించేందుకు వ్రస్తాలను నేశారు. – పొందూరు

చరిత్ర సృష్టించిన ముఖలింగం.. 
» వాండ్రంగి వీధికి చెందిన ఆకాశం ము­ఖ­లింగం 33 సార్లు శ్రీశైలం వెళ్లి మల్లన్నకు వ్రస్తాలను సమర్పించి చరిత్ర సృష్టించారు.  
»  లావేటి వీధికి చెందిన బూడిద చిన్నారావు 21 సార్లు స్వామికి వ్రస్తాలను సమర్పించారు.  
»  వ్రస్తాలను తీసుకొచ్చే పొందూరు కార్మికులకు వసతి, భోజన సదుపాయాలను, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.

ఊరేగింపు   
ఆమదాలవలస రూరల్‌: మందరాడ గ్రామానికి చెందిన దేవాంగులు నేసిన శ్రీశైల మల్లన్న తలపాగాను శ్రీనివాసాచార్యులపేట గ్రామ పురవీధుల్లో ఊరేగించి శివాలయం ప్రాంగణంలో ఉంచారు. మహా శివరాత్రి నాడు శ్రీశైల శిఖరానికి ఈ పాగా చుడతామని నేత కార్మికులు తెలిపారు. ముందుగా గ్రామాల్లో తలపాగాను ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో బొడ్డేపల్లి గౌరీపతి, కె.ప్రసాద్‌రావు, కె.తవుడుబాబు, జి.పకీర్‌ తదితరులు పాల్గొన్నారు.  

నిష్టతో నేశాం.. 
ఎంతో నియమ, నిష్టల తో శ్రీశైలం మల్లన్నకు తలపాగా వ్రస్తాలను నేశాం. ఈ వ్రస్తాలను నేస్తున్నంత సేపు శివనామస్మరణలోనే ఉన్నాం. ఉపవాస దీక్షలోనే వ్రస్తాలను పూర్తిచేశాం. ఏటా వ్రస్తాలను నేసే మహాభాగ్యం మాకు దక్కుతుండటం ఎంతో సంతోషంగా ఉంది. – బనిశెట్టి శ్రీనివాసరావు, చేనేత కార్మికుడు, పొందూరు

వ్రస్తాలను సమర్పిస్తారిలా..
»మల్లికార్జున స్వామికి 366 మూరల (160 మీటర్లు) పొడవు 48 సెంటీమీటర్లు వెడల్పు ఉన్న తలపాగా. 
» భ్రమరాంబ అమ్మవారికి 6 మీటర్లు పసుపు అంచు చీర.
» శనగల బసవన్న (నందీశ్వరుడు)కు 6 మీటర్ల అరుణ వర్ణ అంచు పంచె.
» వినాయకుడికి 6 మీటర్లు ఎరుపు అంచు పంచెలను నేశారు. ఈ వ్రస్తాలను శివలింగాకారంలో మలిచారు. 
» ప్రతి రోజూ తల పాగా, వ్రస్తాల వద్ద భజనలు చేస్తున్నారు. చేనేత వాడలోని ప్రజలంతా పూజలు నిర్వహిస్తున్నారు.
» శివరాత్రి రోజున లింగోద్భవ కాలానికి ముందు..అంటే రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య దేవాలయంలో ప్రవేశాలు నిలిపివేసి, లైట్లన్నీ ఆర్పేస్తారు.
» మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఈ వ్రస్తాలను శ్రీశైలం తీసుకొని వెళ్తారు. దేవాంగులు సమర్పించనున్న   వ్రస్తాలను మహాశివరాత్రి రోజున స్వామికి అలంకరిస్తారు. 
 » ఒక వస్త్రంతో తలపాగా చుట్టి మిగిలిన వ్రస్తాలను నవ నందులకు, గాలి గోపురానికి అలంకరిస్తారు. పవిత్ర వ్రస్తాలను తీసుకుని ఆదివారం ఆయా నేతకారులు శ్రీశైలానికి బయల్దేరారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)