Breaking News

లంకమల అరణ్యం.. వర్థిల్లిన శైవం

Published on Thu, 02/13/2025 - 05:35

బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని సిద్దవటం అటవీ ప్రాంతమైన లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ది నాటి మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాక.. ఈ ప్రాంతంలో ఇంకా ఎలాంటి విశేషాలు, చరిత్ర దాగున్నాయన్న ఉత్సుకత పెరు­గుతోంది. దీనికి తగ్గట్టుగా రోజుకో కొత్త విష­యం బయ­టికి వస్తోంది. కొత్తగా సిద్దవటం అటవీశాఖ క్షేత్రాధికారిణి బి.కళావతి.. వెలుగులోకి తెచ్చిన ఫొటోల ఆధారంగా మరిన్ని విషయాలు బాహ్య ప్రపంచంలోకి వ­చ్చాయి. 

సాక్షిలో ‘ఆధ్యాత్మిక క్షేత్రం.. లంకమల’ కథ­నం ద్వా­రా పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తేవ­డం తెలిసింది. ప్రస్తుతం ఆ కథనానికి మరింత బలం చేకూర్చే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకే చోట గుహ, బండపై శాసనం, శిథిలమైన శివాలయాల ఆనవాళ్లు, శివుని పాద ముద్రలు, అక్కడే పైనుంచి కిందికి దూమికే జలపాతం.. ఇలా అన్నీ ఆధారాలు వెలు­గులోకి వచ్చిన ఈ ప్రాంతానికి కైలాసకోనగా ప్రాచు­ర్యం ఉంది. 

అంటే శివుడు నివసించిన ప్రాంతమని అర్థం. కాబట్టి శైవం ఏ స్థాయిలో ఇక్కడ వర్దిల్లిందో దీ­న్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అందిన ఆధా­రాల­ను పురావస్తుశాఖ క్షుణ్ణంగాపరిశీలిస్తోంది.  

బండలపై ఆధారాలు 
ఈ ప్రాంతంలో శైవ క్షేత్రం వర్థిల్లిందని.. ఆనాటి శైవులు బండలపై శాసనాలు, ఇతర గీతల ద్వారా వెల్లడవుతోంది. శాసనాలను బట్టి 4వ శతాబ్దినాటి శైవులు ఇక్కడ ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. అప్పట్లో ఎలాంటి ఆయుధాలు వినియోగించారో.. తెలిపేలా బండలపై వాటి ఆకృతి తెలిపేలా చెక్కారు. మరోచోట శాసనం, పక్కనే శివలింగ ఆకారం ఉన్నాయి. ఇక్కడి శిథిల ఆలయాల నిర్మాణం కోసం చుతురస్రాకారంలో ఉండే బండలను వినియోగించారని, వాటిని బట్టి స్పష్టం అవుతోంది.

పై కైలాసం.. జారే జలపాతం 
శైవ క్షేత్రాలున్నట్టు గుర్తించిన ప్రాంతానికి సమీపంలోనే పై కైలాసకోన ఉంది. ఇది అద్భుతమైన జలపాతం. పై నుంచి జలపాతం కిందకు దూకే ప్రాంతం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. కొండనడుమ దూకే జలపాత ప్రాంతం ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తుంది. ఈ జలపాతంపై నుంచి కిందకు జారితే కైలాసానికి చేరినట్టే. అందుకనే దీన్ని పై కైలాసంగా ప్రాచుర్యంలో ఉంది. జలపాతం దిగువన గుహలు, ఆలయాలతో కూడిన ప్రదేశమే దిగువ కైలాసకోన.  

అక్కడే గుహ.. ఆలయాలు
లంకమల మొత్తం 36 వేల హెక్టార్ల మేర విస్తరించి ఉండగా.. అందులో సిద్దవటం రేంజి పరిధిలో 26 వేల హెక్టార్ల అభయారణ్యం ఉంది. అడవిలో­ని కొండూరు బీటులో శైవ క్షేత్ర ఆనవాళ్లు విస్తృతంగా లభ్యమయ్యాయి. దిగు­వ కైలాసకోనగా పిలువబడే.. ఈ ప్రదేశంలో అర ఎకరం విస్తీర్ణంలో పదికిపైగా శివాలయాల శిథిలాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పునాదుల బండరాళ్లు, వాటి నిర్మాణం కనిపిస్తున్నాయి. 

పడిపోయిన గోడలు, వాటి శిథిలాలు ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుంటే వాటిని ఆలయాలుగా భావిస్తున్నారు. ఈ చోటనే గుహను కూడా గుర్తించారు. ఆలయాల వద్ద పూజల నిర్వహణ, గుహలో సిద్దులు, యోగులు తపస్సు చేసుకునే వారు. ఇక్కడే శివుడ్ని ఆరాధిస్తున్న వీరుడి విగ్రహం లభ్యమైంది. 

ఈ ప్రాంతం దిగువ కైలాసకోనగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఈ అడవికి సమీపంలో సిద్దవటం గ్రామం ఉంది. అంటే సిద్దులకు ఈ ప్రాంతం నివాసమని భావిస్తున్నారు. దీనివల్లె సిద్దవటం అని పేరొచ్చిందని చెబుతారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)