Breaking News

మరింత సులభంగా ధ్రువీకరణ పత్రాలు 

Published on Sat, 09/30/2023 - 04:04

సాక్షి, అమరావతి: విద్య, ఉద్యోగ ఇతర అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. కుల, నివాస, జనన వివరాలతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్‌ ఒకసారి తీసుకొంటే చాలని స్పష్టం చేసింది.

ఒకసారి పొందిన సర్టిఫికెట్లను శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని,  ప్రతిసారీ కొత్త సర్టిఫికెట్‌ కోసం ఒత్తిడి తేవద్దని పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య శాఖలు, స్కిల్‌ డెవలప్‌మెంట్, వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య తదితర సంక్షేమ శాఖలతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్టిఫికెట్లు ఎక్కడైనా పోయినా, వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ, వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో అదే నంబరుతో కొత్తది పొందే వెసులుబాటు కల్పించింది.

ఇందుకు ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరంలేదు. దరఖాస్తుదారు తన వద్ద ఉండే జిరాక్స్‌ కాపీలో పేర్కొన్న నంబరు చెబితే కొత్తది ఇస్తారు. కుటుంబంలో గతంలో ఎవరూ ఎలాంటి ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండకపోతే దరఖాస్తుదారు ప్రస్తుతం ఈకేవైసీ చేయించుకొని తహసీల్దార్‌ ద్వారా ధ్రువీకరణ పత్రం పొందాలి. ఒక వేళ దరఖాస్తుదారు ఈకేవైసీ చేయించుకొని సర్టిఫికెట్‌ పొంది ఉంటే, అతని తండ్రి లేదా తండ్రి తరపున రక్త సంబం«దీకులు ఎవరైనా ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తహసీల్దార్‌ నుంచి కుల ధ్రువీకరణ పత్రం పొందొచ్చు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)