Breaking News

ప్రైవేటు స్కూల్‌ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!

Published on Tue, 11/04/2025 - 03:40

ఏలూరు టౌన్‌: ఏలూరులో సోమవారం అర్ధరాత్రి మైనర్‌ బాలికపై లైంగిక దాడి కలకలం రేపింది. బాలికకు మద్యం తాగించి మరీ దుండగులు కిరాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.  12 పంపుల సెంటర్‌ సమీపంలో పూలకొట్టు ప్రాంతంలో చీకటిగా ఉన్న సందులో ఒక బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో పరీక్షల అనంతరం నిర్ధారిస్తామని వెల్లడించారు.

బాలిక మద్యం మత్తులో ఉండడంతో  ఆమె చేత దుండగులు బలవంతంగా మద్యం తాగించి అకృత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమె ఎవరనే వివరాలు తెలియరావడం లేదు. ఆమె స్కూల్‌ యూనిఫాంలో ఉండడంతో ప్రైవేటు స్కూల్‌ విద్యార్థినిగా భావి­స్తున్నారు. ఏలూరు టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె స్కూల్‌ విద్యార్థినినా, చెత్త ఏరుకునే బాలికనా అనేది కూడా తేలాల్సి ఉందని చెబుతున్నారు.

బాలిక అపస్మారక స్థితిలో పడిఉన్న ప్రాంతానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండటం, ఆ ప్రాంతంలో గంజాయి బ్యాచ్‌ సంచారం ఇటీ­వల పెరగడంతో ఘటనపై అనేక సందేహాలు వ్యక్తమవు­తున్నాయి. బాలిక స్పృహలోకి వస్తేగానీ పూర్తి వివరాలు చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. కూటమి పాలనలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)