Breaking News

72 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ

Published on Thu, 08/03/2023 - 04:28

ఆంధ్రప్రదేశ్‌లోని 72 రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఆధునికీకరణ, అప్‌గ్రేడేషన్‌ కో­సం గుర్తించినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. 2023–24లో జూన్‌ 2023 వరకు దక్షిణ మధ్య రైల్వేలో అభివృద్ధి నిమిత్తం రూ.83.64  కోట్లు వ్యయం చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ సంజీవ్‌కుమార్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

ఐదేళ్లలో 79 ర్యాంకుల మెరుగు  
ప్రపంచబ్యాంకు డూయింగ్‌ బిజినెస్‌ రిపోర్టు (డీబీఆర్‌)–2020 ప్రకారం భారతదేశ ర్యాంకు 2014లో 142 ఉండగా 79 ర్యాంకులు మెరుగై 2019కి 63వ ర్యాంకుకు చేరుకుందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, ఎన్‌.రెడ్డెప్ప ప్రశ్నకు జవాబిచ్చారు.  

దక్షిణమధ్య రైల్వేలో ఖాళీలు  
దక్షిణమధ్య రైల్వేలో గ్రూప్‌ ఏ, సీల్లో పలు ఖాళీలున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. గ్రూపు ఏలో 110, గ్రూపు సీలో 10,338 ఖాళీలున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

ఏపీ ప్రాంతాలు సికింద్రాబాద్‌ఆర్‌ఆర్‌బీ పరిధిలో  
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలు సికింద్రాబాద్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరిధిలోకి వస్తాయని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ  ఎంపీ సంజీవ్‌కుమార్‌ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దక్షిణమధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలు సికింద్రాబాద్‌ పరిధిలోకి వస్తాయని చెప్పారు. సెంట్రలైజ్డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్ల ప్రకారం దేశంలోని 21 బోర్డుల్లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.  

అనకాపల్లి జిల్లాలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయండి  
అనకాపల్లి జిల్లాలో కేంద్ర ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విదేశాంగమంత్రి జయశంకర్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ బి.వి.సత్యవతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో పాస్‌పోర్టు సేవాకేంద్రం ఏర్పాటుచేస్తే  అల్లూరి, కాకినాడ, విజయనగరం, విశాఖ జిల్లాల వాసులకు కూడా ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)