Breaking News

కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు

Published on Thu, 11/28/2024 - 05:35

సాక్షి, అమరావతి: ఏ పనికైనా అంచనా వ్యయం రూ.కోటి కంటే ఎక్కువ ఉంటే సంబంధిత కాంట్రాక్టర్‌కు 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొబిలైజైషన్‌ అడ్వాన్స్‌ను రద్దు చేస్తూ 2019 డిసెంబర్‌ 17న జారీ చేసిన ఉత్తర్వుల(జీవో 83)ను రద్దు చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు (జీవో 57) జారీ చేశారు. 

2014–19 తరహాలోనే అయిన వారికి, అధిక ధరలకు పనులను కట్టబెట్టి మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లను ముట్టజెప్పి.. వాటి­ని కమీషన్లుగా వసూలు చేసుకుని ఖజానాను దోచే­సేందుకు ప్రభుత్వ పెద్దలు మళ్లీ తెర తీశారని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం టెండర్‌ వ్యవస్థను నీరుగార్చి.. ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అంచనా వ్యయం కంటే అధిక ధరలకు పనులు కట్టబెట్టేవారు. 

వారికి మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ముట్టజెప్పి.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకుందని ఇంజినీరింగ్‌ నిపుణులు అప్పట్లో ఆరోపించారు. అంచనా విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.20 వేల కోట్లకుపైగా భారం పడిందని అప్పట్లో లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో 2019 మే 30న అధికారంలోకి వచి్చన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసింది. 

రూ.వంద కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనుల టెండర్‌ షెడ్యూల్‌ను జ్యుడీíÙయల్‌ ప్రివ్యూకు పంపి ఆ­మో­దం తీసుకున్న తర్వాతే టెండర్లు పిలవాలని ఉత్త­ర్వులు జారీ చేసింది. రూ.కోటి అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనులకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు పిలవాలని నిర్దేశించింది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వాలన్న ని­బం­ధనను రద్దు చేసింది. 

2019 ఆగస్టు నుంచి 2024 ఫిబ్రవరి వరకూ నిర్వహించిన టెండర్లలో అంచనా వ్యయం కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. రివర్స్‌ టెండ­రింగ్‌ వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యింది. కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచి్చన వెంటనే జ్యుడీíÙయల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చేందుకు ఆమోదం తెలపడం గమనార్హం.  

 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)