Breaking News

మా ఎమ్మెల్యేకి రూ.50 లక్షలు ఇచ్చి పిచ్చోడినవుతున్నా!

Published on Thu, 06/26/2025 - 05:47

సాక్షి టాస్క్ ఫోర్స్: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల దందాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే థామస్‌ అనుచరుడితో ఓ క్వారీ వ్యాపారి మాట్లాడిన ఆడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

కార్వేటినగరం మండలంలోని సురేంద్రనగరం పంచాయతీ పరిధిలో.. తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరెడ్డి క్వారీ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే థామస్, ఆయన ప్రధాన అనుచరులు క్వారీ నిర్వాహణకు కప్పం కట్టాలని హుకుం జారీ చేశారు. ఇందుకు వేంకటేశ్వరరెడ్డి అంగీకరించక పోవడంతో రాళ్లు తరలిస్తున్న లారీలను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు ఎమ్మెల్యేను సంప్రదించగా.. తన అనుచరుడు హరీష్‌ యాదవ్‌తో మాట్లాడాలని చెప్పినట్లు సమాచారం. దీంతో హరీష్‌ యాదవ్‌ను కలసి మాట్లాడి రూ.50 లక్షలు ఇచ్చారు. అయినా పనులు పాగనీయలేదు. 

ఇలా అడ్డుకోవడం బాగోలేదని వారిద్దరి మధ్య చర్చ నడిచింది. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే వెంకటేశ్వరరెడ్డి ఎవరో.. ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియదని హరీష్‌ యాదవ్‌ చెబుతున్నారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.  

వెంకటేశ్వరరెడ్డి: సార్‌ మిమ్మల్ని నమ్మి మీ చేతికి రూ.50 లక్షలు ఇచ్చాను. నేను టెన్ష­న్‌ పడుతుంటే మీరు ఫోన్‌ ఎత్తక పోవ­డంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. 
హరీష్‌ యాదవ్‌: మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. నేను అన్నీ తెలుసుకుని మీకు కాల్‌ చేస్తా. 
వెంకటేశ్వరరెడ్డి: అది కాదు సార్‌.. ఎమ్మెల్యే వద్ద నుంచే ప్రాబ్లం..రూ.50 లక్షలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నా. అనారోగ్యంతో బాధ పడుతున్నాను.  
హరీష్‌యాదవ్‌: నేను చెప్తాను అన్నా.. మాట్లాడతాను. 
వెంకటేశ్వరరెడ్డి: కొద్దిగా మాట్లాడు హరీష్. ఎందుకంటే రూ.50 లక్షలు ఇచ్చి పిచ్చోడిని అయిపోతాను హరీష్. ఎందుకంటే నీవు ఎదో పొలిటికల్‌ నుంచి వచ్చావని నమ్మకంతో ఇచ్చాను. 
హరీష్‌ యాదవ్‌: మెటీరియల్‌ చేరాల్సిన చోటుకు చేరింది. 
వెంకటేశ్వరరెడ్డి : నేను ఎవరితో మాట్లాడేది చెప్పు. నాకు నీవే.. ఎమ్మెల్యే కూడా హరీష్‌తో మాట్లాడు అని చెప్పారు కదా. 
హరీష్ యాదవ్‌: నేను మాట్లాడుతాను.. ఓకే నేను సార్‌తో మాట్లాడుతాను. చిన్న డిస్టబెన్స్‌తో ఉన్నాడు. నిన్ను కూడా మాట్లాడిస్తాను. డబ్బులు విషయమైతే కాదు. రెండు మూడు చోట్ల సమస్యలు. నిన్న వచి్చనా మాట్లాడలేకపోయాను. డబ్బులు విషయమైతే కాదు.. చాలా బిజీగా ఉంటున్నారు.   
వెంకటేశ్వరరెడ్డి: కొంచం మాట్లాడండి సార్‌.. ఇక్కడ మీరే నాకు.. ప్లీజ్‌.. 
హరీష్‌యాదవ్‌: నేను ముందున్నాను కాబట్టి ఎమ్మెల్యేకి క్లారిటీగా చెప్పాలి 
వెంకటేశ్వరరెడ్డి: మీరు ముందున్నారనేగా మీ వద్దకు అనేకసార్లు తిరుగుతున్నా సార్‌ 
హరీష్‌యాదవ్‌:  శనివారం, ఆదివారంలో కలసి మాట్లాడతాను.. మీకు క్లారటీ ఇస్తాను వెంకటేశ్వరరెడ్డి.. నేను మీకు చేస్తాను సార్, మీకు ఎమీ కాదు. 
వెంకటేశ్వరరెడ్డి:  నాకు ఇబ్బంది లేకుండా చూడండి. నేను దీనిపై ఆధారపడి ఉన్నాను ప్లీజ్‌ సార్‌. 

ఎమ్మెల్యే థామస్‌ అనుచరుడు హరీష్‌

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)