Breaking News

చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి చేయూత 

Published on Wed, 07/13/2022 - 12:16

నెల్లూరు రూరల్‌(నెల్లూరు జిల్లా): హార్ట్‌లో హోల్‌తో బాధపడుతున్న చిన్నారికి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేయూతనందించారు. బాలికకు ఆపరేషన్‌ విజయవంతమైంది. మంగళవారం చిన్నారితో పాటు తల్లిదండ్రులు నెల్లూరులోని రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీధర్‌రెడ్డి రూరల్‌ పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
చదవండి: బాగున్నావా అవ్వా..!

ఈ సమయంలో గిరిజన కుటుంబానికి చెందిన పొట్లూరి స్నేహ అనే చిన్నారికి గుండె సమస్య ఉన్నట్లుగా ఆయన దృష్టికి వెళ్లింది. చిన్నారి తల్లిదండ్రులు తమ బాధను ఆయనకు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే కారు ఏర్పాటు చేసి వారితోపాటు తన ప్రతినిధిని తిరుపతిలోని పెద్ద ఆస్పత్రికి పంపారు. చిన్నారి ఆపరేషన్‌ విషయమై అక్కడి వైద్యులతో కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద స్నేహకు ఆపరేషన్‌ చేయగా విజయవంతమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన వద్దకు వచ్చిన స్నేహతో ఎమ్మెల్యే ఎంతో ఆప్యాయంగా మాట్లాడి దుస్తులు అందజేశారు. ఆ కుటుంబానికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు.

Videos

పాక్ దాడుల వెనుక టర్కీ, చైనా హస్తం..

పాక్.. ప్రపంచాన్ని మోసం చేసే కుట్ర

Army Jawan: తల్లిదండ్రులును ఎదిరించి ఆర్మీలోకి వెళ్ళాడు

Himanshi Narwal: ఆ వీరుడి ఆత్మకు సంపూర్ణ శాంతి

400 డ్రోన్లతో విరుచుకుపడ్డ పాక్ ఒక్కటి కూడా మిగల్లేదు

141కోట్ల ప్రజల రక్షణకై అడ్డునిలిచి వీర మరణం పొందాడు

పంజాబ్ లో చైనా మిస్సైల్..!?

LOC వెంట ఉన్న పాక్ పోస్టులను ధ్వంసం చేస్తున్న ఇండియన్ ఆర్మీ

భారత అమ్ములపొదిలో మూడు ప్రధాన యుద్ధ ట్యాంకులు

యుద్ధానికి ముందు ఫోన్ చేసి.. వీర జవాను మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీరు

Photos

+5

భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ + వెస్ట్రన్‌... లాపతా లేడీ సరికొత్త స్లైల్‌ (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)

+5

War Updates: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ

+5

తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)

+5

బర్త్ డే స్పెషల్.. సాయిపల్లవి గురించి ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్‌ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)

+5

తిరుపతి : గంగమ్మా..కరుణించమ్మా సారె సమర్పించిన భూమన (ఫొటోలు)