Breaking News

ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం!

Published on Mon, 06/09/2025 - 05:52

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం చోటుచేసుకుందనే చర్చ మరోసారి ఊపందుకుంది. మహారాష్ట్రలో ఈవీఎంల మాయాజాలంవల్లే బీజేపీ గెలిచిందని.. వచ్చే ఎన్నికల్లో బిహార్‌లోనూ అదే రీతిలో గెలిచేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, రాహుల్‌గాంధీ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఆరోపించారు. ఈ వ్యాసాన్ని ఉటంకిస్తూ మహారాష్ట్ర తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలంతో కూటమి గెలిచిందంటూ ‘ఎక్స్‌’ వేదికగా రిటైర్డు ఐఏఎస్‌ పీవీఎస్‌ శర్మ ఉద్ఘాటించారు. 

‘ఆంధ్రప్రదేశ్‌లో 2024, మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86 శాతం ఓట్లు పోలైనట్లు తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన దానికి.. చివరిసారిగా ప్రకటించిన శాతానికి, పోలింగ్‌ 13.74 శాతం ఎక్కువగా ఉంది. దీనివల్ల 46 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయి. అంటే.. సగటున ఒక్కో నియోజకవర్గానికి 26 వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. చివర్లో పెరిగిన పోలింగ్‌ శాతమే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది’ అంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పీవీఎస్‌ శర్మ ఆదివారం కుండబద్దలు కొట్టారు.

రాయచోటిలో అధికంగా పోలైన ఓట్లన్నీ ఒకే పార్టికా!? : గడికోట
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘నేను ప్రాతినిధ్యం వహించి పోటీచేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్‌ సరళి తదితర అంశాలను, గణాంకాలను పరిశీలిస్తే.. కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024లో జరిగిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే.. 2012, 2014, 2019 ఎన్నికల్లో 62 వేల నుంచి 66 వేల ఓట్లు టీడీపీకి వచ్చాయి. వైఎస్సార్‌సీపీకి 92 వేల నుంచి 98 వేల మధ్య ఓట్లు వచ్చాయి.

2014తో పోలిస్తే 2019లో పోలైన ఓట్ల పెరుగుదల కేవలం 200 మాత్రమే. 2019తో పోల్చితే 2024లో 30 వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూలేదు. కానీ, 2024లో వైఎస్సార్‌సీపీకి 95 వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే.. వైఎస్సార్‌సీపీ ఓట్లు అలానే ఉన్నాయి. కానీ, టీడీపీకి మాత్రం 96 వేల ఓట్లు వచ్చాయి. అంటే.. 2019తో పోలిస్తే 2024లో అధికంగా పోలైన 30 వేల ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతోంది. అధికంగా పోలైన ఈ 30 వేల ఓట్లు ఒకే పార్టికి ఎలా పడతాయి? ఇది సాధ్యమేనా? ఇది నమ్మశక్యమేనా?’ అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)