Breaking News

డ్రోన్‌ నుంచి క్షిపణి ప్రయోగం సక్సెస్‌

Published on Sat, 07/26/2025 - 05:41

దేశ రక్షణ సామర్థ్యాలకు మరింత ఊతమిస్తూ డీఆర్‌డీఓ చేపట్టిన యూఏవీ లాంచ్డ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ క్షిపణి (యూఎల్‌పీజీఎం–వీ3) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నేషనల్‌ ఓపెన్‌ ఏరియా రేంజ్‌ (ఎన్‌ఓఏఆర్‌)లో డీఆర్‌డీఓ మానవ రహిత డ్రోన్‌ వైమానిక వాహనం ద్వారా శుక్రవారం ఈ క్షిపణి ప్రయోగం చేపట్టింది. గతంలో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన యూఎల్‌పీజీఎం–వీ2 అధునాతన వెర్షన్‌ ఇది. 

యూఎల్‌పీజీఎం–వీ3 అనేక రకాల లక్ష్యాలను ఛేదించగలిగిన హై డెíఫినిషన్‌ డ్యూయల్‌ చానల్‌ సీకర్‌తో అమర్చబడి ఉంటుంది. దీనిద్వారా మైదానం, అధిక ఎత్తు ప్రాంతాల నుంచి ప్రయోగించొచ్చు. ఇది పగలు, రాత్రి పనిచేసే సామార్థ్యాన్ని కలిగి ఉంటుంది.  లక్ష్యం, లక్ష్య పాయింట్‌ నవీకరణకు రెండు మార్గాల డేటా లింక్‌ను కలిగి ఉంటుంది.   - సాక్షి, న్యూఢిల్లీ/కర్నూలు (సెంట్రల్‌)/ఓర్వకల్‌

క్షిపణుల ప్రయోగాలకుకేంద్రంగా ఎన్‌ఓఏఆర్‌.. 
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో ఉన్న డీఆర్‌డీఓకు చెందిన నేషనల్‌ ఓపెన్‌ ఏరియా రేంజ్‌ (ఎన్‌ఓఏఆర్‌) క్షిపణుల ప్రయోగాలకు కేంద్రంగా మారింది. గతంలో కూడా డీఆర్‌డీఓ యూఎల్‌పీజీఎం–వీ2 క్షిపణి పరీక్ష కోసం ఎన్‌ఓఏఆర్‌ వేదికనే వినియోగించింది. ప్రస్తుతం ప్రయోగించిన యూఎల్‌పీజీఎం–వీ3 క్షిపణి ప్రయోగానికి కూడా అదే వేదికైంది. ఈ ఆయుధం మానవ రహిత విమానాలను కూల్చేందుకు వినియోగిస్తారు. 

ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలతో భారత డ్రోన్‌ యుద్ధతంత్రంలో ముందంజ వేస్తోంది. దాదాపు 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ  అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ రేంజ్‌. దీనిని 2016–17లో ప్రారంభించారు. సాధారణంగా.. ఇండోర్‌లో పరీక్షించే ఈడబ్ల్యూ ఆయుధాలు అందుబాటులోకి రావాలంటే ఏడాది నుంచి రెండేళ్లు సమయం పడుతుంది. కానీ, బాహ్య ప్రదేశాల్లో పరిరక్షించేవి వేగంగా దళాల్లోకి చేరే అవకాశం ఉంటుంది.   

అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాల ఛేదన కోసం.. 
ఇక్కడ పరీక్షించే ఆయుధాల్లో రాడార్లు, ట్రాన్స్‌మీటర్లు, యాంటెనాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్‌ పరికరాలతోపాటు డైరెక్ట్‌ ఎనరీ (లేర్‌) వెపన్స్‌ కూడా ఉంటున్నాయి. యూఎల్‌పీజీఎం శ్రేణి ఆయుధాలను తపస్‌ బీహెచ్, అర్చర్‌ ఎన్‌ఈ యూఏపీల కోసం అభివృద్ధి చేశారు. వీటిని చాలా తక్కువ ధరతో ఉత్పత్తి అవుతాయి. ఈ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తాయి. అత్యంత సమీపం నుంచి జరిగే పోరాటాల్లో ఫైర్‌ అండ్‌ ఫర్‌గెట్‌ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి.  

రక్షణ మంత్రి అభినందనలు.. 
యూఏవీ లాంచ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ ఫ్లైట్‌ ట్రయల్స్‌ విజయవంతం కావడంతో  రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ డీఆర్‌డీఓను అభినందించారు. కీలక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాల­ను భారత్‌ అందిపుచ్చుకుని ఉత్పత్తిచేసే స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం విజయవంతం కోసం ఎంఎస్‌ఏఈ, స్టార్టప్‌లను కూడా ఆయన అభినందించారు. 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)