Breaking News

మందుల సరఫరాలో మతలబు!

Published on Fri, 01/31/2025 - 03:26

సాక్షి, అమరావతి : ఓ వైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను తన వాళ్లకు ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతూనే మరోవైపు బీమా పథకం పేరిట ప్రభుత్వ నిధులను ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు మళ్లించి దోపిడీకి కార్యాచరణ సిద్ధంచేశారు. ఇదే తరహాలో ప్రభు త్వా స్పత్రులకు మందుల సరఫరా వ్యవహారంలోనూ కూటమి ప్రభుత్వం అవినీతికి తెరలేపింది. 

బోధనా స్పత్రులకు జన్‌ ఔషధి మందుల సరఫరా కోసం తిరుపతికి చెందిన సంస్థతో ఓ మంత్రి డీల్‌ కుదు ర్చుకున్నట్లు తెలిసింది. ఆ సంస్థతోనే బోధనాస్ప త్రుల సూపరింటెండెంట్‌లు ఒప్పందం (ఎంఓయూ) చేసుకునేలా లిఖితపూర్వక ఆదేశాలివ్వా లని వైద్యశాఖ అధికారులపై మంత్రి కార్యాలయం ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మా కోసమే ఆ ఉత్తర్వులు..
ఇదిలా ఉంటే.. జన్‌ ఔషధి మందుల కొనుగోలుపై వైద్యశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశా రు. దీంతో మంత్రితో డీల్‌ కుదుర్చుకున్న మందుల సరఫరా సంస్థ ప్రతినిధులు కొద్దిరోజులుగా ఆస్ప­త్రు­ల సూపరింటెండెంట్లను సంప్రదిస్తున్నారు. ‘మేం మంత్రి తాలూకా.. మా కోసమే జన్‌ ఔషధి ఉత్తర్వులిచ్చారు. మా సంస్థతో ఎంఓయూ చేసు కోవాలి’ అని కోరినట్లు తెలిసింది. 

అయితే, ఫలాన సంస్థతోనే ఎంఓయూ కుదుర్చుకోవాలని తమకె­క్కడా రాతపూర్వక ఆదేశాల్లేవని సూపరింటెండెంట్లు చెబుతుండడంతో సంస్థ ప్రతినిధులకు నోట్లో పచ్చి వెలక్కాయపడినట్లయింది. దీంతో.. నేరుగా సదరు సంస్థతోనే ఎంఓయూ చేసుకోవాలని అంద రు సూపరింటెండెంట్లను ఒప్పించడానికి మంత్రి కా ర్యాలయం కిందామీదా పడుతున్నట్లు తెలుస్తోంది.

డీల్‌లో భాగంగానే తెరపైకి జన్‌ ఔషధీ..
సాధారణంగా బోధనాస్పత్రులకు మందుల కొనుగోలుకు కేటాయించే మొత్తం బడ్జెట్‌లో 80 శాతం మేర మందులను సెంట్రల్‌ ప్రొక్యూర్‌­మెంట్‌ విధానంలో ఏపీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేస్తుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌తో ఆస్ప­త్రులు అత్యవసర మందులను స్థానికంగానే కొనుగోలు చేస్తుంటాయి. గత ప్రభుత్వంలో ఈ మందులను సైతం కేంద్రీకృత విధానంలోనే సరఫరా చేశారు. 

ఈ విధానానికి కూటమి ప్రభు­త్వం స్వస్తి పలికి సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా సరఫరా కాని, ఇతర అత్యవసర మందులను పీఎంబీజేకే–జన్‌ ఔష«ధి కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కేంద్రాల్లో అందుబాటులో లేని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనుగోలు చేసేలా మార్గదర్శకాలిచ్చింది. మంత్రి డీల్‌ మేరకు జన్‌­ఔషధీ విధానం తెరపైకి వచ్చిందని వైద్య­శాఖలో చర్చ జరుగుతోంది. ఈ సంస్థకు రాయలసీమతో పాటు, మరికొన్ని జిల్లాల్లో జన్‌ ఔషధీ మందుల కేంద్రాలున్నాయి.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)