Breaking News

అడ్డొస్తే... శాల్తీలు లేచిపోతాయ్‌..!

Published on Mon, 12/02/2024 - 04:24

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ‘ఎవరైనా అడ్డొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శాల్తీలు లేచిపోతాయ్‌.. బాడీలు కూడా కనపడకుండా చేస్తా. ఇక్కడికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ సద్దాం వస్తే మర్యాదగా ఉండదు’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు బెదిరించారు. ఈ ఘటన ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. పెనుకొండ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఖబరస్థాన్‌ వద్ద రోడ్డు పక్కన పలువురు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ 40 ఏళ్లకు పైగా జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

ఇక్కడ దుకాణం పెట్టుకున్న నయాజ్‌ దాన్ని కొంతకాలం క్రితం రియాజ్‌ అనే వ్యక్తికి స్నేహ పూర్వకంగా ఇచ్చి ముంబై వెళ్లాడు. ఇటీవల తిరిగొచి్చన అతను, తన షాపు తనకు ఇవ్వాలని కోరగా రియాజ్‌ నిరాకరించాడు. వీరి మధ్య వివాదం కొనసాగుతుండగానే రియాజ్‌  ప్రస్తుతమున్న షాపును శ్మశానం వైపు పొడిగించి పెద్ద షెడ్డు వేస్తుండడంతో మసీదు కమిటీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. రియాజ్‌ వారి మాటను పట్టించుకోకపోవడంతో దుకాణానికి తాళం వేశారు.

దీంతో టీడీపీ కార్యకర్త అయిన రియాజ్‌ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన పోలీసులతో చేరుకుని దుకాణం తాళాలను పగులగొట్టడమే కాకుండా అక్కడున్న జామియా మసీదు కమిటీ సభ్యులను తీవ్రంగా బెదిరించారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు దాదు, నిషార్, షమి, సన్నా తదితరులు దౌర్జన్యానికి దిగారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సర్ది చెప్పి రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా మంత్రి భర్త దౌర్జన్యంపై ముస్లింలు మండిపడ్డారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)