Breaking News

నువ్వో చిల్లరగాడివి!

Published on Thu, 05/08/2025 - 04:35

తాడిపత్రి టౌన్‌: విలేజ్‌ క్లినిక్‌లలోని డాక్టర్లపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ నోరుపారేసుకున్న ఘటన మరిచిపోకముందే తాజాగా ఓ సీఐపైనా ఆయన తన నోటికి పనిచెప్పారు. ‘రోజూ చిల్లర తీసుకునే చిల్లర గాడివి’ అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ సాయిప్రసాద్‌పట్ల ఫోన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సీఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషయం ఏమిటంటే.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతం కావడంతో తాడిపత్రి పట్టణంలో వీహెచ్‌పీ నాయకులు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌లో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. 

అదే సమయంలో స్టేషన్‌కు వచ్చిన ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ ఇది గమనించి బాణాసంచా కారణంగా వాహనదారులకు, పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వారిని స్టేషన్‌కు తీసుకురావాలని సీఐ సాయిప్రసాద్‌ను ఆదేశించారు. సీఐ అక్కడికి వెళ్లి సంబరా­లు చేసుకోవడానికి అనుమతిలేదని, స్టేషన్‌కు రా­వా­లన్నారు. ఈ క్రమంలో.. వీహెచ్‌పీ నాయకుల్లో ఒకరు సీఐ కాలర్‌ పట్టుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో వారిని బలవంతంగా స్టేషన్‌కు తీసుకొచ్చారు. 

అక్కడ వీహెచ్‌పీ నేతల్లో ఒకరు మంత్రి సత్యకుమార్‌కు ఫోన్‌చేసి సీఐకి ఇవ్వగా..  ‘రోజూ చిల్లర తీసుకునే చిల్లరగాడివి’.. అంటూ సీఐను మంత్రి దూషించినట్లు  తెలిసింది. ఫోన్‌ పెట్టేసిన వెంటనే సీఐ.. ‘నేనేమీ చిల్లర తీసుకునే వాణ్ణి  కాదు.. నన్ను వేరే స్టేషన్‌కు మార్చుకోమనండి.. ఐదు నిమిషాల్లో వెళ్లిపోతా. పోస్టు పీకి పడేస్తే టీకొట్టు పెట్టుకుని బతుకుతా. మీ అందరిపై కేసు బుక్‌చేసి పడేస్తా. అధికారం ఉంది కాబట్టి కేసు మూసేసుకుంటారేమో.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓపెన్‌ చేసి పడేస్తా.. ఏం చేస్తారు?’ అంటూ వీహెచ్‌పీ నాయకులపై ఆయన ఫైర్‌ అయ్యారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)