Breaking News

అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు: మంత్రి పయ్యావుల

Published on Fri, 01/31/2025 - 08:26

ఉరవకొండ: ‘నీతిఆయోగ్‌(NITI Aayog) దేశంలోని 18 రాష్ట్రాల  ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో మన రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. ఏపీకి అప్పు తీసుకునే శక్తితోపాటు తీర్చే శక్తి కూడా లేదని తేల్చి సున్నా మార్కులు వేసింది’ అని రాష్ట్ర  ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌(Payyavula Keshav) అన్నారు. గురువారం అనంతపురం జిల్లా ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

దేశం మొత్తమ్మీద అప్పు తీసుకునే అర్హత లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) మాత్రమేనని నీతిఆయోగ్‌ తేలి్చందన్నారు. అయితే తాము అప్పులు ఉన్నాయని సాకు చూపి తప్పించుకోలేమని, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. 

 ఆర్థిక భారం ఉన్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి చూపుతామన్నారు. రాయలసీమ బాగుపడాలంటే నీళ్లు రావాలని, నీళ్లు రావాలంటే పోలవరం పూర్తి కావాలన్నారు.  పోలవ­రం పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాగానే జిల్లాల మధ్య నీటి యుద్ధాలు ఆగిపోయాయన్నారు. రాయలసీమలో లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్నారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి  ఆర్థిక సాయం చేయడంతో పాటు  రైల్వే ప్రాజెక్టులపై రూ.90 వేల కోట్లు, జాతీయ రహదారులకు రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. ఇవన్నీ పూర్తయితే సంపద సృష్టి జరిగి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. సంపద సృష్టి అంటే ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు పథ­కాలు ముందుకు తీసుకుపోవడమేనని చెప్పారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)